కరివేపాకు చెట్టును ఇంట్లో పెంచుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

ముందుగా మీడియం సైజ్ కుండీ ఉండాలి. 12 నుంచి 15 అంగుళాలు లోతు ఉంటే మంచిది.

గార్డెన్ మట్టి, కంపోస్ట్, ఇసుక లేదా కోకోపీట్ కలిపి మట్టిని తయారు చేసి కుండీలో వేసుకోవాలి.

మరీ గట్టిగా నొక్కి పెట్టకుండా కరివేపాకు మొక్కను నాటాలి.

5 నుంచి 6 గంటలు డైరక్ట్ సన్​లైట్​ పడేలా కుండీని పెట్టుకోవాలి.

వారానికి రెండు నుంచి మూడుసార్లు నీరు వేయాలి. లేదా మట్టి గట్టిగా అయినప్పుడు వేయాలి.

ఎక్కువ నీటిని వేస్తే మొక్క పాడైపోయే అవకాశముంది. కాబట్టి లిమిటెడ్​గా వేయాలి.

రెండు మూడు వారాలాకోసారి బటర్ మిల్క్, పేడ, కిచెన్ కంపోస్ట్ వేయాలి.

రెగ్యులర్​గా ట్రిమ్ చేస్తూ ఉంటే కరివేపాకు కొద్ది వారాల్లో గుబురుగా పెరుగుతుంది.

ఐరన్ పుష్కలంగా ఉండే ఫెర్టిలైజర్ వేయవచ్చు. బనానా తొక్కలు కూడా వేయొచ్చు.