తేనెతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందుతాయి. అందుకే దీనిని చాలామంది తీసుకుంటారు.

అయితే మంచి తేనె తీసుకుంటేనే ఈ లాభాలు శరీరానికి అందుతాయి. కానీ మార్కెట్లో ఎక్కువ కల్తీనే దొరుకుతుంది.

స్వచ్ఛమైన తేనె అని అమ్మినా.. అది మంచిదో కాదో.. ప్యూరిటీ ఉందో లేదో ఇంట్లో ఎలా చెక్ చేయాలో చూసేద్దాం.

తేనెను నీటిలో వేసి కలపాలి. త్వరగా కలిసిపోతే అది ఫేక్. మంచి తేనె నీటిలో త్వరగా కలవదు.

తేనెను బొటనవేలుపై వేయాలి. అది జారిపోకుండా అలాగే ఉంటే మంచిది. ఈజీగా జారిపోతే ఫేక్.

కాటన్​ను తేనెలో ముంచి వెలిగించాలి. ఈజీగా అంటుకుంటే అది మంచి తేనె.

తేనెను నీటిలో వేసి కొన్ని చుక్కల వెనిగర్ వేస్తే ఫోమ్ వచ్చిందంటే ఫేక్. రియాక్షన్ లేకుంటే ఒరిజనల్.

పేపర్ టవల్ మీద తేనె వేస్తే అది పూర్తి పీల్చుకుని తడి మరక కనిపిస్తే ఫేక్. ఒరిజనల్ అయితే పీల్చుకోకుండా ఉండిపోతుంది.

క్రిస్టలైజేషన్ ద్వారా కూడా ఫేక్ హనీని గుర్తించవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. మంచి తేనెను కొనే ముందు అగ్​మార్క్ టెస్ట్ చెక్ చేసుకోండి.