పండిన అరటిపండ్లను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

వాటిని బ్లెండర్​లో లేదా మిక్సీ జార్​లో వేయాలి. దానిలో పాలు వేయాలి.

రెండు అరటిపండ్లు తీసుకుంటే రెండు కప్పుల పాలు వేసుకోవాలి.

1 లేదా 2 టీస్పూన్ల పంచదార లేదా షుగర్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్లు వేసుకోవచ్చు.

ఇప్పుడు దానిలో రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి.

దానిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి లేదా యాలకుల పొడి ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు.

నచ్చితే ఐస్​క్రీమ్ కూడా వేసుకోవచ్చు. దీనివల్ల రుచి, టెక్చర్ కూడా మంచిగా వస్తుంది.

ఇప్పుడు అన్ని కలిసేలా బ్లెండ్ చేసుకోవాలి. అరటిపండు స్మూత్​గా మారేవరకు మిక్సీ చేసుకోవాలి.

బాగా చిక్కగా ఉందనిపిస్తే కాస్త పాలు వేసుకుని మళ్లీ బ్లెండ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు ఓ గ్లాస్​లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరి. టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ.