కడుపు నొప్పి అనేది సాధారణ సమస్యే. కాబట్టి ప్రతీసారి మందులు వాడకూడదు.

ఎక్కువసార్లు వస్తోన్నా, తీవ్రంగా ఉన్నప్పుడే మెడిసన్స్ తీసుకోవడం, వైద్య సహాయం తీసుకోవడం చేయాలి.

కానీ సాధరణంగానే నొప్పి ఉంటే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి.

ఎసిడిటీ లేదా మంటగా అనిపిస్తే బేకింగ్​ సోడాను నివారణగా వాడొచ్చు.

గ్లాసు గోరువెచ్చని నీటిలో అరటీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి తాగాలి.

ఇది ఎసిడిటీని తగ్గించి.. నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

పసుపు కూడా కడుపు మంటను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కాబట్టి గ్లాసు గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి తీసుకోవచ్చు. ఇది సురక్షితమైన నివారణ.

వాము కూడా గ్యాస్, కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

వామ్మును నీటిలో వేసి మరిగించి దానిని వడకట్టి తీసుకోవచ్చు. లేదా పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు.