మిల్​మేకర్ రెగ్యులర్​గా తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. అవేంటో చూసేద్దాం.

మిల్​మేకర్​లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల్లో 52 గ్రాముల ప్రోటీన్ అందుతుంది.

చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్​ని పెంచుతుంది. గుండె సమస్యలు తగ్గిస్తుంది.

వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషం ఉంటాయి. ఇవి బోన్స్ హెల్త్​కి మంచివి.

ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

PCOS సమస్య ఉన్నవారు హార్మోనల్ బ్యాలెన్స్ కోసం మిల్​మేకర్ తినొచ్చు.

వీటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది గట్​ హెల్త్​ని ప్రమోట్ చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ప్రోటీన్, ఐరన్, జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యులర్ తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.