ఐస్ క్యూబ్​తో మసాజ్ చేస్తే కళ్లు ఉబ్బడం తగ్గుతుంది. ఉదయాన్నే చేస్తే మరీ మంచిది.

వృద్ధాప్య ఛాయలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. చర్మాన్ని టైట్​గా చేస్తుంది.

ఓపెన్ పోర్స్​ని క్లోజ్ చేస్తుంది. ముఖంపై ఆయిల్​ని తొలగిస్తుంది. పింపుల్స్ తగ్గుతాయి.

ఇన్​ఫ్లమేషన్​ని, ఎరుపుదనాన్ని తగ్గిస్తాయి. యాక్టివ్​గా ఉండే మొటిమలు కంట్రోల్ అవుతాయి.

రక్తప్రసరణ పెరిగి స్కిన్ హెల్తీగా, గ్లోయింగ్​గా మారుతుంది.

మేకప్​కి ముందు ఐస్​క్యూబ్ అప్లైచేస్తే స్కిన్ మరింత స్మూత్​గా ఉంటుంది.

డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి దీనిని రెగ్యులర్​గా అప్లై చేస్తే మంచిది.

కళ్లు నీరసంగా ఉన్నా.. డల్ అయినా, స్కిన్ సన్ డ్యామేజ్ అయినా ఈజీగా రికవరీ అవుతుంది.

ఐస్ క్యూబ్​ని నేరుగా కాకుండా కాటన్ క్లాత్​లో చుట్టి ఉపయోగిస్తే మంచిది.

నీటిలో గ్రీన్ టీ వేసి లేదా రోజ్ వాటర్​తో ఐస్ క్యూబ్​లు చేసుకుని వాటిని అప్లై చేస్తే మరీ మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.