News
News
వీడియోలు ఆటలు
X

Weight Loss: పాస్తా తింటే బరువు తగ్గుతారా? ఎటువంటి పాస్తా ఎంచుకోవాలి?

బరువు తగ్గించే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలు అయిన కూడా పరిమితంగా తీసుకుంటే మాత్రమే బరువు అదుపులో ఉంటుంది.

FOLLOW US: 
Share:

చాలా త్వరగా చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లో పాస్తా ఒకటి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు పాస్తా ఎంచుకోవచ్చా అంటే ఖచ్చితంగా తినొచ్చని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారం వదిలేసి చప్పగా ఉండే ఆహారాలు తీసుకుంటారు. అలా చేసినంత మాత్రాన బరువు తగ్గరు. సరైన ఆహారం ఎంచుకోవాలి. మీకు పాస్తా ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే చక్కగా దాన్ని లాగించేయండి. అయితే అందులో ఎక్కువగా ఛీజ్ వేసుకుని తినకూడదు.

కూరగాయలు జోడించాలి

పాస్తాను పోషకాలు నిండిన ఆహారంగా చేయాలంటే అందులో కూరగాయలు జోడించుకోవాలి. పాస్తా, కూరగాయల నిష్పత్తి 1:2 గా ఉండాలి. ఉల్లిపాయలు, టొమాటో, క్యాప్సికమ్, బెల్ పెప్పర్, మొక్కజొన్న, పుట్టగొడుగులు, బ్రకోలి, క్యారెట్ లేదా మీకు నచ్చిన ఇతర ఏదైనా కూరగాయలు వేసుకుని తీసుకోవచ్చు. కొద్దిగా నూనెలో కూరగాయ ముక్కలు వేసి వేయించుకుని దానిపై ఉడికించిన పాస్తా కలుపుకోవచ్చు.

పాస్తా రకం ముఖ్యం

మైదా లేదా సూజీ ఆధారిత పాస్తాను ఎంచుకునే బదులు ఆరోగ్యకరమైన దాన్ని ఎంచుకోవాలి. మార్కెట్లో అనేక రకాల పాస్తాలు అందుబాటులో ఉంటాయి. వీటిని బరువు తగ్గించే ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. బుక్వీట్ పాస్తా, హోల్ వీట్ పాస్తా, చిక్‌పీ పాస్తా, రాజ్మా పాస్తా, లెంటిల్ పాస్తా, మఖానా పాస్తా వంటి పాస్తా వేరియంట్‌లు ఉత్తమ ఎంపికలు.

ఎంత తీసుకుంటున్నారు?

బరువు తగ్గించే ఆహారం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఆహార పరిమాణం. బరువుని అదుపులో ఉంచే విషయంలో ఆహార పరిమాణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారీగా భోజనం చేస్తే బరువు తగ్గరు. కేవలం ఒక చిన్న గిన్నె పాస్తా మాత్రమే తీసుకోవాలి. 80 శాతం పొట్ట నింపుకుని 20 శాతం ఖాళీ కడుపుతో ఉండటం ఎప్పుడు మంచిది.

రుచికరమైన పాస్తా ఇలా చేయండి

ఒక కప్పు గోధుమ పాస్తాను తీసుకుని తగినంత నీటిలో ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత అందులోని నీటిని తీసేయాలి. ఒక పాన్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. అందులో టొమాటో, క్యాప్సికమ్, సొరకాయ, బెల్ పెప్పర్, పుట్టగొడుగులు, మొక్కజొన్న మొదలైన 2 కప్పుల తరిగిన కూరగాయలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అందులో కాస్త నల్ల మిరియాల పొడిని వేసుకోవాలి. వాటిని 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా వేగిన కూరగాయ ముక్కలో ముందుగా ఉడకబెట్టిన పాస్తా వేసి కలుపుకోవాలి. మరొక రెండు నిమిషాల పాటు ఉడికించి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన పాస్తా రెడీ అయిపోయింది. దీన్ని తీసుకోవడం వల్ల పాస్తా తినాలనే మీ కోరిక తీరుతుంది. కూరగాయ ముక్కలు జోడించడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!

Published at : 09 Feb 2023 02:07 PM (IST) Tags: Healthy Food Pasta Weight Loss Food Weight Loss Benefits Of Pasta

సంబంధిత కథనాలు

Ghee: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే

Ghee: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే

Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో

Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో

Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే

Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే

Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు

Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు

White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?