News
News
X

ఎయిర్ ఫ్రైయర్స్‌ వేపుళ్లు తింటే క్యాన్సర్ వస్తుందా?

ఈ మధ్య కాలంలో ఎయిర్ ఫ్రైయర్స్‌ చాలా పాపులర్ అయ్యాయి. ఎందుకేంటే ఇవి తిన్నా కూడా బరువు పెరగరని, ఆయిల్ లేకుండా ఎలాంటి గిల్ట్ లేకుండా కావల్సినంత ఫ్రైడ్ ఫూడ్ తినొచ్చని ఆశ పడుతున్నారు.

FOLLOW US: 

కరకరలాడే పొటాటో చిప్స్ ఇక నచ్చినన్ని తినొచ్చట. వేయించిన చికెన్ ముక్కలు గిల్ట్ లేకుండా ఎన్నయినా లాగించెయ్యొచ్చట. నూనె ఎక్కువ వాడకుండానే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చెయ్యొచ్చట. అదేలాగా అనుకుంటున్నారా? ఎయిర్ ఫ్రైయర్స్ వల్ల అలా చేయడం సాధ్యమే.

కిచెన్ గాడ్జెట్స్ లో ఎయిర్ ఫ్రైయర్ అన్నింటికంటే ముందుంటోంది. చూసేందుకు చిన్న కుక్కర్ లాగే ఉంటుంది. దీని వినియోగానికి సాధారణ కుక్కర్ తో పోలిస్తే సగం ఇంధనం చాలు. అందువల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది.

దీని పేరు ఎయిర్ ఫ్రైయర్ అయినప్పటికీ ఇది ఆహార పదార్థాలను వేయించదు.  నూనె వాడకుండానే ఆహారం క్రిస్పీగా ఉండేలా మారుస్తుంది. చాలా మందికి నచ్చుతున్న ఈ ఫ్రైయర్ ల గురించి చాలా తక్కువే పరిశోధన జరుగుతోందని చెప్పవచ్చు.

ఫూడ్ తయారీ సమయంలో ఆహారాన్ని వేయించడం వల్ల అక్రిలామైడ్ వంటి ప్రమాదకరమైన సమ్మేళనాలు తయారవుతాయని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది. ఈ రసాయనం ఎక్కువ వేడి ఉపయోగించి చేసే వేపుళ్ల వంటి వంటకాల్లో ఏర్పడుతుంది.

News Reels

ఇంటర్నేషనల్  ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ ఈ రసాయనం రకరకాల క్యాన్సర్లకు అక్రిలామైడ్ నేరుగా కారణం అవుతోందని అంటున్నారు. వీరి ప్రకారం ఎండోమెట్రియల్, అండాశయ, పాంక్రియాటిక్, రొమ్ము, అన్నవాహిక వంటి అనేక క్యాన్సర్లు ఈ రసాయనం కారణంగా రావచ్చు. ఎయిర్ ఫ్రైయర్‌తో వంట వల్ల ఆహారంలో అక్రిలమైడ్ ఉత్పత్తి కాకుండా నివారించవచ్చు. అయితే ఈ మ్యాజిక్ వస్తువు వల్ల నష్టాలు కూడా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఫ్రైడ్ ఫూడ్ కంటే ఎయిర్ ఫ్రైడ్ మంచివే అనేది నిపుణుల విశ్వాసం.

‘‘ఈరోజుల్లో లివింగ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. పోషణ భారంగా మారింది. ఎయిర్ ఫ్రైయర్ లో ఫూడ్ తయారు చేసినపుడు తక్కువ ఫ్యూయల్ లేదా విద్యుత్ ఉపయోగించడం, ఇందులో నూనె వాడకం చాలా పరిమితంగా ఉండడం ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిదే’’ అని డిడాకాట్ లోని వుడ్ల్యాండ్  మెడికల్ సెంటర్ కు చెందిన డాక్టర్ రాచెల్ వార్డ్  తెలిపారు. డీప్ ఫ్రై లో ఎక్కవ నూనె ఉపయోగించాల్సి వస్తుంది. దీనితో పోలిస్తే ఎయిర్ ప్రైయర్ లో చాలా తక్కువ నూనె వినియోగంలో ఉంటుంది. కనుక కచ్చితంగా ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఎయిర్ ఫైయర్లను వాడేవారు రిపీటెడ్ గా ఒకేరకమైన ఆహారాన్ని తీసుకుంటారేమో అని మాత్రమే డాక్టర్ రాచెల్ అనుమాన పడుతున్నారు.

కేవలం మీట్, బంగాళదుంపలను ఉడికించడానికి మాత్రమే ఎయిర్ ఫ్రైయర్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇలా కాకుండా అన్ని కూరగాయాలను, రకరకాల వంటకాలను తయారు చేసుకుని తిన్నప్పుడు ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదవుతుంది.

ఎయిర్ ఫ్రయర్ ను దాదాపు మొత్తం వంటకు ఉపయోగించేవారు ఆహారంలో సమతుల్యత తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందడం చాలా ముఖ్యం. ఎయిర్ ఫ్రైయర్లలో తయారైన ఆహారం తినడం ద్వారా బరువు తగ్గడం, బరువు మరింత పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే అని డాక్టర్ సారా జార్విస్ అంటున్నారు. సాధారణ వంటతో పోలిస్తే 75 శాతం తక్కువ నూనెతో ఏయిర్ ఫ్రైయర్లలో వంట పూర్తిచెయ్యవచ్చు. కనుక తక్కువ క్యాలరీలు శరీరంలో చేరుతాయి.

ఏయిర్ ఫ్రైయర్ ఒక కన్వెక్షన్ ఓవెన్ మాదిరిగానే పనిచేస్తుంది. హీటింగ్ ఎలిమెంట్ ద్వారా వేడిగాలి తయారవుతుంది. ఇది ఫ్రైయర్ లో ఉన్న ఫూడ్ చుట్టూ ఉండే ఫ్యాన్ల ద్వారా తిరుగుతుంది. అక్కడ ఉన్న ఆహార పదార్థాలు అన్ని వైపుల నుంచి ఉడికిపోతుంది. ఎక్కువ నూనె వాడకుండానే క్రిస్ప్, బ్రౌన్ ఫూడ్ రెడీ అవుతుంది. ఆహారం తయారయ్యే ప్రాసెస్ లో బాస్కెట్ కు అంటుకోకుండా కాస్త నూనె రాయడం మాత్రం తప్పనిసరి. 

Also Read: నాలుక మీద పుండ్లను నిర్లక్ష్యంగా చేస్తున్నారా? జాగ్రత్త క్యాన్సర్ కావచ్చు

Published at : 04 Nov 2022 06:47 PM (IST) Tags: Health Cancer Food nutrition air frier

సంబంధిత కథనాలు

పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

Lung Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు

Lung Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు

Viral Video: సెగలు కక్కే లావాలోకి మనిషి పడిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడండి

Viral Video: సెగలు కక్కే లావాలోకి మనిషి పడిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడండి

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!