Blinking Eyes: కళ్లార్పడం వల్ల చూపు చురుగ్గా అవుతుందట, ఇలా చేస్తే సైట్ తగ్గించుకోవచ్చు
Blinking Eyes: కళ్లార్పడం వల్ల మన చూపు చురుగ్గా మారుతుందని ఓ అధ్యయనం ఆసక్తికర విషయం వెల్లడించింది.
Blinking Eyes Improves Vision: మనకి తెలియకుండానే తరచూ మనం కన్నార్పుతుంటాం. అది చాలా సహజంగా జరిగిపోతుంది. ఏదో మనకు బాగా నచ్చి అలాగే తదేకంగా చూస్తే తప్ప కను రెప్పలు మూయకుండా ఉండలేం. ఒకవేళ మీరు బలవంతంగా కను రెప్పలు మూయకుండా ఉంటే వెంటనే కన్నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఇలా మనం కన్నార్పిన ప్రతిసారీ మన కనుగుడ్లలో తడి చేరుతుంది. అయితే...ఇలా కన్నార్పడం వల్ల మన విజన్ కూడా మెరుగవుతుందని ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది ఓ అధ్యయనం. బ్లింకింగ్ వల్ల ఉపయోగాలేంటి అనే కోణంలో పరిశోధన చేయగా అది మన దృష్టిని మెరుగు పరుస్తుందని వెల్లడైంది. ఇలా చేయడం వల్ల retinal stimulation పెరుగుతుందని తేలింది. ఈ కారణంగానే మన విజిబిలిటీ పెరుగుతుందని చెప్పింది ఈ స్టడీ. నిజానికి సైట్ ఉన్న వాళ్లు ఓ తెల్లని గోడవైపు చూస్తూ 5 సెకన్లకోసారి కన్నార్పుతూ కాసేపు చేస్తూ కొంత వరకూ ఆ సమస్య పోతుందని వైద్యులు చెబుతుంటారు. బ్లింకింగ్‌కి ఉన్న పవర్ అలాంటిది. అంతే కాదు. ఇలా కళ్లార్పడం వల్ల అటెన్షన్ పెరుగుతుందట. ఓ వస్తువుని గుర్తించగలిగే శక్తీ పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు.
12 మందిపై అధ్యయనం..
మనం ఇలా కళ్లార్పినప్పుడు 300 మిల్లీ సెకన్ల పాటు చూపు కోల్పోతాం. ఆ కాసేపు విజువల్ ఇన్‌పుట్స్‌కి మన కళ్లలోని న్యూరాన్స్ స్పందించకుండా ఉండిపోతాయి. అయితే...ఇలా కళ్లు మూసి తెరిచిన ప్రతిసారీ విజిబిలిటీ అంతకు ముందు కన్నా చాలా చురుగ్గా మారుతుందని 2016లో ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ స్టడీలో భాగంగా 12 మందికి రకరకాల ఇమేజెస్ చూపించారు. రెండు కళ్లు ఆర్పినప్పటికీ ఓ కన్నుపై మాత్రమే పరిశోధన చేశారు. అలా బ్లింక్ చేసి కళ్లు తెరిచే క్రమంలో వాళ్లకు ఎదురుగా ఉన్న వస్తువులు మరింత క్లియర్‌గా కనిపించాయని చెప్పారు. రెటీనాపై పడే కాంతి తీవ్రత పెరిగిందని గుర్తించారు. రోజులో కనీసం 10 గంటలు పని చేస్తామనుకుంటే...ఆ సమయంలో దాదాపు 10% సమయం ఇలా కళ్లార్పుతూ గడుపుతామట.
ఇలా సైట్ తగ్గించుకోవచ్చు..
కొన్ని ఎక్సర్‌సైజ్‌ల ద్వారా కొంత వరకూ ఐ సైట్ తగ్గించుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు. అందులో Eye rolling ఒకటి. గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని పని చేసే వాళ్లు క్లాక్‌వైజ్‌లో కాసేపు, యాంటీ క్లాక్‌వైజ్‌లో కాసేపు కళ్లను గుండ్రంగా తిప్పాలి. మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఇలా దాదాపు 5 సార్లు చేయడం ద్వారా కళ్లకు మంచి వ్యాయామం అవుతుంది. వెబ్‌సిరీస్ బింగేవాచ్ చేసినప్పుడు, ల్యాప్‌టాప్‌పై కంటిన్యుయస్‌గా పని చేసినప్పుడు 20-20 రూల్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు వైద్యులు. అంటే ప్రతి 20 నిముషాలకోసారి ల్యాప్‌టాప్‌ని పక్కన పెట్టి ఏదైనా ఓ వస్తువుని 20 అడుగుల దూరం నుంచి 20 సెకన్ల పాటు తదేకంగా చూడాలి. ఆకుకూరలు, గుడ్డుసొన, బంగాళా దుంప, గుమ్మడికాయ, క్యారెట్‌లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా దృష్టి లోపాన్ని తగ్గించుకోవచ్చు. చేపలు ఎక్కువగా తీసుకున్నా కంటి చూపు సమస్యలు తగ్గిపోతాయి.
Also Read: Overcome Past Trauma: బ్రేకప్ బాధ నుంచి బయట పడేసే టెక్నిక్స్ ఇవే, సైంటిస్ట్‌ల కొత్త రీసెర్చ్