Bizarre Traditions: అప్పట్లో ఆడవాళ్లకు రాచరికం అదృష్టం కాదు, ప్రసవ సమయంలో అలా...
రాచరిక కుటుంబాల్లోని మహిళలను చూసి ఎంత అదృష్ట వంతులో అనుకుంటారు, కానీ వారి జీవితమంతా ప్రోటోకాల్స్ మధ్యే గడిచిపోతుంది.
ఇప్పటి రాచరిక కుటుంబాలకు చెందిన మహిళలు చాలా హూందాగా, దర్జాగా జీవిస్తున్నారు. కానీ పూర్వం వారి పరిస్థితి వేరు. కఠినమైన సంప్రదాయాలు, నియమాలు, వింత ఆచారాల నడుమ నలిగేపోయేవారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో చాలా ఆచారాలను పాటించేవారు. అవి నచ్చినా, నచ్చకపోయినా నో చెప్పే అధికారం వారికి లేదు. రాచరిక కుటుంబంలో ప్రసవం అనేది చాలా పెద్ద సంఘటన. అది కేవలం కుటుంబ సంబరం కాదు, ఆ రాజ్య వారసత్వానికి సంబంధించినది. అది ఆ రాజ్య భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంటారు. అందుకే అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసవ సమయంలో చాలా వింత ఆచారాలు అమలులో ఉండేవి.
మేరీ ఆంటోనెట్టె 17 శతాబ్ధపు ఫ్రెంచ్ రాణి. కేవలం 14 ఏళ్లకే ఆమెకు పెళ్లి చేశారు. ఆమె తన తొలి సంతానానికి జన్మనిచ్చినప్పుడు పెద్ద హాలులో దాదాపు 200 మంది చుట్టూ ఉన్నారు. వారి రాజరిక నియమాల ప్రకారం రాణి అలా వందల మంది మధ్యే ప్రసవించాలి. సహజప్రసవం అందరి ముందు చేసుకోవడానికి చాలా మంది రాణులు ఇబ్బంది పడేవారు.
బ్రిటన్ రాజ్య కుటుంబంలో రాణులంతా ఇంటి దగ్గరే ప్రసవించేవారు. అందుకోసం బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఒక గదిని ప్రత్యేకంగా కట్టించారు. అందులోనే ప్రసవాలన్నీ జరగాలన్న నియమం పెట్టారు. కానీ తొలిసారి ప్రిన్సెస్ డయానా ఆ నియమాన్ని ఉల్లంఘించింది. ఆమె తన మొదటి కొడుకు ప్రిన్స్ విలియంను ప్రసవించేందుకు ఆసుపత్రిలో చేరింది. అప్పట్నించి ఆ కుటుంబంలోని మహిళలంతా ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవడం మొదలుపెట్టారు.
కొన్ని రాజ్యాలలో మహారాణులను తమ బిడ్డకు పాలిచ్చేందుకు అనుమతించేవారు కాదు. ఆ పని రాణులది కాదని చెప్పేవారు. మహారాణి పని కేవలం వారసులను కనడమేనన్న ప్రోటోకాల్ అమలులో ఉండేది. బిడ్డకు పాలు పెట్టడం వల్ల, మళ్లీ గర్భం ధరించడం ఆలస్యమవుతుందని వారి నమ్మకం. బిడ్డకు పాలు పెట్టే వీలులేక ఆ తల్లులు మానసిక వేదన గురయ్యేవారు.
17 వశతాబ్ధంలో మహారాణులు ప్రసవ సమయంలో మంత్రసానులు, నర్సుల చేత ప్రమాణం చేయిస్తారు. వారు చుట్టు పక్కల ఏ వస్తువులు దొంగిలించకూడదని, అలాగే బిడ్డ మాయను కూడా గుర్తుగా తమతో తీసుకెళ్లకూడదని ప్రమాణం చేశాక ప్రసవానికి అనుమతిస్తారు.
Also read: కోళ్లన్నీ ఒక ఎత్తు... ఈ నల్లకోళ్లు మరో ఎత్తు, తింటే వావ్ అనాల్సిందే
Also read: యూరిన్ రంగు మారిందా? జాగ్రత్త పడండి
Also read: Good touch And Bad touch: పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కొన్ని చిట్కాలు ఇవిగో...