Monsoon Vacation Spots in India : వర్షాకాలంలో ఇండియాలో టూర్‌కి వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు ఇవే.. ట్రిప్ ప్లాన్ చేసేసుకోండి
Rainy Season Tourist Places India : మాన్సూన్ సీజన్లో ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఇండియాలోని ఈ ప్రదేశాలకు వెళ్లిపోవచ్చు. ఎందుకంటే..

Scenic Places to Visit in Monsoon : వర్షాకాలం చాలా త్వరగా వచ్చేసింది. మే నుంచే వర్షాలు మొదలైపోయాయి. ఈ రొమాంటిక్ వెదర్లో మీరు ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. వర్షాకాలంలో ఇండియాలో మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఏ ప్లేస్‌లకు వెళ్లాలో.. అక్కడ ఏమి స్పెషల్‌గా చూడొచ్చో.. మాన్సూన్ టాప్ డెస్టినేషన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
మున్నార్
కేరళలోని మున్నార్ వర్షాకాలంలో వెళ్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అక్కడి టీ గార్డెన్స్, చుట్టూ కొండలు.. మాన్సూన్లో చాలా అందంగా కనిపిస్తాయి. జలపాతాలు మీకు మంచి డ్రీమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. మీరు దగ్గర్లోని ఎర్వాకులమ్ నేషనల్ పార్క్‌ని కూడా సందర్శించవచ్చు.
కూర్గ్
కూర్గ్‌ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. వర్షాకాలంలో మీరు వెళ్లేందుకు ఇది అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక్కడ హిల్ స్టేషన్లు, కాఫీ ఎస్టేస్ట్లు వర్షాకాలంలో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు మీరు వెళ్లొచ్చు. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ వ్యాలీ మాన్సూన్లో 500 రకాల ఆల్పైన్ పువ్వులతో వికసించి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు.
ఉదయ్‌పూర్
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కూడా వర్షాకాలంలో వెళ్లేందుకు అనువైన ప్రదేశంగా చెప్తారు. రొమాంటిక్ వెదర్ని ఎంజాయ్ చేయాలనుకునేవారు ఇక్కడి వెళ్లొచ్చు. చుట్టూ సరస్సులు, సీనరి లుక్స్ మీ మనసును కట్టిపడేస్తాయి. పిచోలా సరస్సు, బోట్ రైడ్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
చిరపుంజి
మేఘాలయాలోని చిరపుంజి గురించి అందరూ వినే ఉంటారు. ఇక్కడ అత్యంత వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఇక్కడ వంతెనలు, జలపాతాలు మాన్సూన్ ఎక్స్‌పీరియన్స్‌ని రెట్టింపు చేస్తాయి. నోహ్కాలికై వాటర్ ఫాల్స్, మావ్స్మై కేవ్స్, వంతెను ఆకట్టుకుంటాయి.
గోవా
వర్షాకాలంలో గోవా బీచ్పార్టీలకు ఆఫ్ సీజన్ అనుకుంటారు. కానీ ప్రశాంతమైన పచ్చని వాతావరణం మీ సొంతమవుతుంది. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్, పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.
ఖండాల
మహారాష్ట్రలోని లోనావాల, ఖండాల కూడా వర్షాకాలంలో ట్రిప్‌కి వెళ్లేందుకు అనువైన ప్రదేశం. ఈ హిల్ స్టేషన్స్ మీకు సీనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. వాటర్ ఫాల్స్, హిల్స్, టైగర్ పాయింట్, బూషి డ్యామ్, ఫోర్ట్ ట్రెక్ ఇక్కడ బాగా ఫేమస్.
ఇవి ఇండియాలో మాన్సూన్లో ట్రావెల్ చేయాలనుకునేవారికి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. పైగా వర్షాకాలంలో టూరిస్ట్‌లు తక్కువగా ఉంటారు కాబట్టి రేట్లు కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ. ప్రకృతి అందాలను వీక్షించాలనుకునేవారి వర్షాకాలం బెస్ట్ ఆప్షన్. రొమాంటిక్, ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారు ఈ సమయంలో ట్రావెల్ చేయవచ్చు.






















