Coorg Budget Friendly Trip : కూర్గ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి 5కెలో ఇలా వెళ్లిపోండి, ఫుల్ డిటైల్స్ ఇవే
Coorg Trip in 5K from Telugu States : సమ్మర్లో టూర్‌కి వెళ్లాలనుకుంటే కూర్గ్ అనువైన ప్రదేశం. తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ ఖర్చులో ఎలా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

Budget Friendly Coorg Trip in 5K : సమ్మర్లో కూల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటే కూర్గ్‌కి వెళ్లొచ్చు. ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి వెళ్లేందుకు బెస్ట్ ప్లేస్ ఇది. అయితే ఈ ట్రిప్‌ని మీరు బడ్జెట్లో వెళ్లాలని ప్లాన్ చేస్తే మీకు ఈ స్టోరి కచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎలా వెళ్లాలి అనే దగ్గర నుంచి.. ఏ ప్లేస్‌లు కచ్చితంగా విజిట్ చేయొచ్చో.. ఎంత ఖర్చు అవుతుందో వంటి విషయాలు తెలుసుకోవచ్చు. కేవలం 5కెలో ఈ బడ్జెట్‌ని ఎలా ఫినిష్ చేయొచ్చో చూసేద్దాం.
ఏపీ, తెలంగాణ నుంచి కూర్గ్ జర్నీ
హైదరాబాద్ నుంచి మైసూర్‌కు ట్రైన్లో వెళ్లేందుకు సాయంత్రం 7.05 గంటలకు ట్రైన్ అందుబాటులో ఉంటుంది. దీనిని ఎక్కితే ఉదయం 10.15కు మైసూర్లో దిగుతారు. దీని టికెట్ ధర 453 నుంచి ప్రారంభమవుతుంది. రాజమండ్రి నుంచి వెళ్లాలనుకుంటే ప్రతి శనివారం రాజమండ్రి టూ మైసూర్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. శనివారం ఉదయం 8.30కి ఎక్కితే.. మరుసటిరోజు ఉదయం 3.35కి మైసూర్లో దిగుతారు. దీని టికెట్ 575 నుంచి ప్రారంభమవుతుంది. లేదంటే రాజమండ్రి నుంచి బెంగళూరు వచ్చి.. అక్కడి నుంచి కూర్గ్‌కి వెళ్లొచ్చు.
స్టేయింగ్ & ఫుడ్
రెండు రాష్ట్రాల నుంచి బస్ జర్నీలు కూడా చేయవచ్చు. బస్ జర్నీకి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మైసూర్‌కి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి కూర్గ్‌కి చాలా బస్‌లు అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర 130 నుంచి ప్రారంభమవుతుంది. కూర్గ్‌లో మీరు హోటల్స్ కంటే హాస్టల్‌ని ఎంచుకుంటే మంచిది. ఇవి తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కోసం వెళ్లినప్పుడు దీనిని ట్రై చేయవచ్చు. హాస్టల్లో స్టేయింగ్కి ఒకరికి 400 ఛార్జ్ చేస్తారు. స్కూటీని రెంట్‌కి తీసుకోవచ్చు. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. రోజుకు 125 నుంచి 600 ఛార్జ్ చేస్తూ స్కూటీని రెంట్‌కి ఇస్తారు. లోకల్ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తే తక్కువ ఖర్చులోనే టెస్టీ ఫుడ్‌ని రుచి చూడవచ్చు.
చూడాల్సిన ప్రదేశాలు..
కూర్గ్‌లో మీరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అబ్బీ ఫాల్స్‌కి వెళ్లండి. దాని ఎంట్రీ టికెట్ ధర 10 మాత్రమే. ఫోటోలకు అనువైన ప్రదేశం. తర్వాత గ్లాస్ బ్రిడ్జ్‌కి వెళ్లొచ్చు. దీని ఎంట్రీ టికెట్ 300. వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ మీ సొంతమవుతుంది. హరంగి రిజర్వాయర్ కూడా తప్పక వెళ్లాల్సిన ప్రదేశాల్లో ఒకటి. దీని ఎంట్రీ కాస్ట్ 10. రాత్రుళ్లు వెళ్తే వాటర్ షో కూడా చూడొచ్చు.
కాఫీ ప్లాంటేషన్స్కి తప్పక వెళ్లండి. దీని ఎంట్రీ టికెట్ ధర 200. అక్కడ మీరు కాఫీ చెట్లను చూడొచ్చు. మీరు కాఫీ ప్రియులైతే రకరకాల కాఫీ ఫ్లేవర్స్ ట్రై చేయవచ్చు. కొనుక్కోవచ్చు కూడా. దుబారె ఎలిఫెంట్ క్యాంప్‌ని 120 రూపాయలతో విజిట్ చేయవచ్చు. నీటిలో 200 మీటర్లు నడిచి వెళ్లి ఏనుగులను చూడొచ్చు. గోల్డెన్ టెంపుల్‌కి కచ్చితంగా వెళ్లండి. మంచి ఫీల్ ఉంటుంది. కూర్గ్ నుంచి మీరు మైసూర్‌కి రిటర్న్ వచ్చి.. అక్కడ మైసూర్ ప్యాలెస్‌ని చూడొచ్చు. దీని ఎంట్రీ 120 రూపాయలు. పగలు కంటే దీనిని రాత్రళ్లు విజిట్ చేస్తే మరింత బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్ మీ సొంతమవుతుంది.
మైసూర్ నుంచి మీరు మీ ప్లేస్‌కి ట్రైన్లో లేదా బస్‌లోనే రిటర్న్ అయిపోవచ్చు. సమ్మర్లో విజిట్ చేయడానికి కూర్గ్ చాలా మంచి ప్రదేశం. ఎక్కవమంది ఎండ నుంచి ఉపశమనం కోసం ఇక్కడికే వెళ్తారు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్‌తో లేదా లాంగ్ వీకెండ్లో సోలో జర్నీ కోసం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. బడ్జెట్లో వెళ్లాలనుకుంటే ఈ ప్లాన్‌ని ఫాలో అయిపోండి. కంఫర్ట్ కోసం జర్నీ స్టైల్ మార్చుకోవచ్చు. హోటల్స్‌లో స్టే చేయవచ్చు.






















