అన్వేషించండి

Heart Health: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

చామదుంపని తినరా? జిగటగా ఉంటుందని పక్కన పెడుతున్నారా? అయితే మీ గుండెకు రక్షణ ఎలా?

చామదుంపను చాలామంది పక్కన పడేస్తారు. తినడానికి ఇష్టపడరు. కానీ దాని వల్ల ఎన్ని లాభాలో తెలుసా? గుండె జబ్బులను అడ్డుకునే శక్తి చామ దుంపలో ఉంది. చామదుంపని చాలా మంది తినడానికి ఇష్టపడరు కారణం అవి చేతికి జిగటగా తగులుతాయి. అందుకే దాన్ని తినడానికి ఇష్టపడరు. కానీ రూట్ వెజిటబుల్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది కూడా ఒక సాధారణ కూరగాయే.  బీరకాయ, సొరకాయ ఎలా వండుకుంటారో అలా వండుకుని తినవచ్చు. 

ఈసమస్యలు దూరం
ఈ దుంపలో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మధుమేహులకు చాలా మేలు జరుగుతుుంది. ఇన్సులిన్ స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్, ఇ విటమిన్, మెగ్నిషియం నిండి ఉంటుంది. ఈ పోషకాలను కలిగి ఉన్న చామ దుంపను తరచూ తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకూ ఇది ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్న వారు తరచూ చామదుంపని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇది తిన్నాక ఎక్కువ సేపు ఆకలి వేయదు. 

వెజిటేరియన్లకు ఈ దుంప వరమనే చెప్పాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కంటిచూపు మెరుగు పరుస్తుంది. కంటి కణాల క్షీణతను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల పునరుత్తికి సహాయపడతాయి. 

గుండెకు రక్షణ
ఈ దుంపలో ఉండే విటమిన్ ఇ, డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వల్ల గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. గుండె పోటు రాకుండా ఉండాలన్నా, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలన్న మీ మెనూలో చామదుంపని చేర్చుకోవాలి. దీనిలో జీరో కేలరీలు, జీరో కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా కాపాడుతుంది. దీనిలో తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతుుంది. ఆకస్మిక గుండె పోటు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతుంది. 
కాబట్టి వారానికోసారైనా చామదుంప వేపుడు, పులుసు చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. 

Also read: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

Also read: ప్రాణాన్ని నిలబెట్టే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, వీటితో మరిన్ని ఉపయోగాలు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget