By: ABP Desam | Updated at : 24 Sep 2022 10:07 AM (IST)
Edited By: Soundarya
image credit: pexels
కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు. ప్రస్తుతం అందరూ ఫోన్స్, ల్యాప్ టాప్స్ ఎక్కువగా చూస్తూనే ఉంటున్నారు. అదే పనిగా వాటి స్క్రీన్స్ చూడటం వల్ల కళ్ళు బాగా అలిసిపోతున్నాయి. అధిక ఒత్తిడి, నిద్రలేమి ఇతర కారణాల వల్ల కంటి కింది భాగంలో నల్లటి వలయాలు, హైపర్ పిగ్మెంటేషన్, కంటి కింద సంచులు ఏర్పడటం, కళ్ళు ఉబ్బిపోవడం వంటి తీవ్రమైన ప్రభావాలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. అందుకే కళ్ళకి చాలా విశ్రాంతి అవసరం. కంటి సంరక్షణ చాలా అవసరం. అది హైడ్రేట్ కాకుండా తేమగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా స్క్రీన్స్ చూడటం వల్ల కళ్ళల్లో తేమ తగ్గిపోయి పొడి బారి పోవడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
కళ్ళని సంరక్షించుకుని వాటి కింద ఏర్పడే వలయాలు పోగొట్టుకునేందుకు కంటి కీదా జెల్ సీరమ్ వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇవి కంటిని రక్షిస్తూనే మీ అందాన్ని కూడా మరింత పెంచుతాయి. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడి చూడటానికి కూడా అందవిహీనంగా కనిపిస్తారు. వాటి నుంచి బయటపడేందుకు ఐ జెల్ సీరమ్ ఉపయోగించవచ్చని బ్యూటీషియన్స్ చెబుతున్నారు.
ఐ జెల్ సీరమ్ ఎలా ఉపయోగించాలి?
కంటి కింద చర్మం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కళ్ళని కాపాడుకునేందుకు డీ పఫింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి తరచూ చెయ్యాలి. సన్ స్క్రీన్స్ కూడా ఉపయోగించాలి. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పోగొట్టుకునేందుకు లిక్విడ్, జెల్, సీరమ్‌లు, లోషన్, క్రీమ్, ఆయింట్‌మెంట్ ఇలా అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి. మీకు సరిపడే వాటిని ఎంచుకుని వాటితో ప్రతిరోజు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. వాటిని మీరు నిద్రపోయే ముందు కంటి కింద అప్లై చేసుకోవచ్చు. అండర్ ఐ జెల్ సీరమ్ ఉపయోగించుకోవడానికి ఉదయం పూట చాలా అనువైన సమయం.
చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే వాటి వల్ల ఐ జెల్స్ వినియోగించడం ఒక్కోసారి కుదరకపోవచ్చు. అందుకే ముందుగా క్లెన్సర్ తో ప్రారంభించాలి. ఆపై టోనర్, సీరమ్, కంటి క్రీమ్‌లు (జెల్ సీరమ్), స్పాట్ ట్రీట్‌మెంట్, మాయిశ్చరైజర్, ఫేస్ ఆయిల్ రాసుకున్న తర్వాత చివరగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఫేస్ ఆయిల్స్ అనేది బొటానికల్ ఆయిల్స్ లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ తో కూడినవి. ఇవి బ్రేక్ అవుట్స్, చర్మంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోకుండా చేస్తుంది.
ఇదే విధంగా రాత్రి వేళ కూడా
కంటి సంరక్షణ కోసం ఏదైతే చేస్తామో అదే పని రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందు కూడా చెయ్యాలి. రోజంతా పని చేసి ఉండటం వల్ల కళ్ళు బాగా అలిసిపోతాయి. వాటికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే పడుకునే ముందు మీ ముఖాన్ని, కళ్ళని శుభ్రంగా కడుక్కోవాలి. పడుకోవడానికి కొన్ని నిమిషాల ముందు క్రీమ్స్ అప్లై చేసుకోవాలి. ఉత్పత్తులు రాత్రి పూట రాసుకోవడం వల్ల కంటి కింద చర్మాన్ని చక్కగా కాపాడతాయి. ఇలా చేయడం వల్ల కళ్ళు నిస్తేజంగా మారకుండా ఉంటాయి. కళ్ల కింద సంచులు, వలయాలు రాకుండా చూసుకోవడం అంత తేలికైన పని కాదు. ఇవే కాదు మీ కంటికి ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాహారం తీసుకోవడం అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం. సరైన సంరక్షణ కోసం తప్పకుండా కంటికి మేలు చేసే ఆహారాన్ని మీ డైట్లో భాగం చేసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Also Read: ‘బ్లాక్ కాఫీ’ ప్రేమలో షారుఖ్, రితేష్ - దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ లవ్‌లో పడిపోతారు
జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి
Hair Conditioner: జుట్టుకి షాంపూ చేసిన ప్రతిసారీ కండిషనర్ పెట్టడం అవసరమా? ప్రయోజనం ఏంటి?
Winter Skin Care: చలికాలంలో మీ చర్మం పగిలిపోకుండా ఇలా కాపాడుకోండి
Peanuts: మచ్చలు పోయి చర్మం నిగనిగలాడాలంటే వేరుశెనగ తినండి
Hair Care: తలస్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? అలా చేస్తే జుట్టు రాలిపోతుంది
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!