By: ABP Desam | Updated at : 17 Mar 2023 12:43 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
సమ్మర్ సీజన్ లో ఎక్కువగా దొరికే పండు మామిడి. తియ్యని రుచితో జ్యూసీగా ఉండే ఈ పండు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు అందాన్ని పెంచుతుంది. మామిడిలో విటమిన్ ఏ, సి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి రెండూ ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం. ఇందులోని విటమిన్ A ముడతలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక విటమిన్ C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సూర్యరశ్మి, కాలుష్య ప్రభావాలని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఫేస్ మాస్క్, స్క్రబ్ రూపంలో దీన్ని వినియోగించుకుని ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. ఇవే కాదు చర్మానికి మరెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
స్కిన్ మాయిశ్చరైజర్: ఇందులోని విటమిన్ A చర్మాన్ని తేమగా మార్చేందుకు సహకరిస్తుంది. చర్మం పొడిబారిపోకుండా చేస్తుంది. మామిడి పండు గుజ్జుని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
మొటిమలు నివారిస్తుంది: మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడతాయి. ఈ పండు గుజ్జుని ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
చర్మం మెరిసిపోతుంది: విటమిన్ A, C చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి. డార్క్ స్పాట్స్ తగ్గిస్తాయి. మామిడి గుజ్జు చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.
నల్లటి వలయాలు: విటమిన్ - K పుష్కలంగా ఉంటుంది. కళ్ళ చుట్టూ వచ్చే నల్లటి వలయాలు పోగొడుతుంది. ఈ పండు గుజ్జు కంటి కింది భాగంలో రాసుకుంటే నల్లటి వలయాలు తగ్గిపోతాయి.
వృద్ధాప్య సంకేతాలు దూరం: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు రాకుండా చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. చర్మం యవ్వనంగా, మృదువుగా మారుతుంది.
మంట తగ్గిస్తుంది: మామిడితో ఫేస్ ప్యాక్ చర్మం మంటని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం మీద వాపు, నొప్పిని తగ్గిస్తాయి. మామిడి గింజల నూనె రాసుకోవచ్చు. శక్తివంతమైన మాయిశ్చరైజర్ గా మామిడి తొక్కల పొడితో మాస్క్ లేదా క్లెన్సర్ గా రాసుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు..
మామిడి పండులో బీటా కెరోటిన్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. ఈ పండు తింటే ఇనుము సమృద్ధిగా లభిస్తుంది. రక్తహీనత సమస్య ఉండదు. మధుమేహులు ఒక మామిడి కాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. కానీ అతిగా తింటే మాత్రం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ సమస్యలున్న వాళ్ళు పరగడుపున కాఫీ తాగొద్దు
Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలను ఇలా శాశ్వతంగా వదిలించుకోండి
ఈ పండ్లు తిన్నారంటే మెరిసే చర్మం మీ సొంతం
Viranica’s Maison Ava: లండన్‌లో మంచువారి కోడలు కొత్త బిజినెస్, లగ్జరీ స్టోర్ ఆరంభించిన విరానిక
Holi 2023: హోలీ రంగుల నుంచి మీ జుట్టుని ఇలా సంరక్షించుకోండి
Carrot Juice: ఈ ఒక్క జ్యూస్ తాగారంటే చాలు అందంతో పాటు ఆరోగ్యం కూడా
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?