IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

వీడియో: చూస్తుండగానే సముద్రంలోకి కొట్టుకెళ్లిపోయిన ఇల్లు, అలలపై తేలుతూ..

సముద్ర తీరంలో ఉన్న ఓ ఇల్లు అలల తాకిడికి కూలిపోయింది. ఆ తర్వాత సముద్రంలోకి కొట్టుకెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

FOLLOW US: 

ముద్ర తీరంలో ఇళ్లను నిర్మించడం ఎప్పటికైనా ప్రమాదమే. సముద్రం ఎప్పుడూ ఉన్న చోటే ఉండదు. భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఎగిసిపడుతుంది. ఇక సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది మీకు తెలిసిందే. సముద్రం ముందుకొచ్చి అమాంతంగా ఇళ్లను మింగేస్తుంది. తాజాగా నార్త్ కరోలినాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

హట్టెరాస్ ద్వీపంలోని రోడంతే‌లో సముద్రం ఒక్కసారిగా ముందుకొచ్చింది. అలలు బలంగా తీరాన్ని తాకాయి. దీంతో సముద్ర తీరంలో ఉన్న ఓ ఇల్లు అందులో చిక్కుకుంది. లక్కీగా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అది చెక్కతో నిర్మించిన ఇల్లు కావడంతో క్షణాల్లోనే అది సముద్ర అలల తాకిడికి కూలిపోయింది. ఆ తర్వాత అది సముద్ర అలల్లో కలిసిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కేప్ హటెరాస్ నేషనల్ సీషోర్‌కు చెందిన యూఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒక రోజు వ్యవధిలోనే రెండు ఇళ్లు అలల్లో కలిసిపోయాయని తెలిపారు. ఇవి కాకుండా ఇంకా ఆ ప్రాంతంలో మరో 9 ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సముద్రం ఇంకా ముందుకొస్తే భవిష్యత్తులో మరిన్ని ఇళ్లు ప్రమాదంలో చిక్కుకునే అవకాశాలున్నాయని తెలిపారు. 

Also Read: హెలికాప్టర్‌ను కూల్చేసిన షార్క్, కిరణ్ బేడీని తిట్టిపోస్తున్న నెటిజన్స్, ఎందుకంటే..

అధికారులు పోస్టు చేసిన వీడియోలని ఇల్లు విలువ సుమారు రూ.2.95 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, నెటిజనులు.. తీరానికి అంత దగ్గర్లో ఇల్లు కట్టేందుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. పర్యవరణానికి కూడా అది ముప్పేనని వెల్లడిస్తున్నారు. US నేషనల్ పార్క్ సర్వీస్ డేటా ప్రకారం.. సముద్ర తీరం సుమారు 282 అడుగుల మేర కోతకు గురైంది. అందుకే ఆయా నివాసాలు అలల్లో కలిసిపోయాయి. అధికారులు పోస్ట్ చేసిన వీడియోను ఇక్కడ చూడండి. 

Also Read: వీడియో - అపస్మారక స్థితిలో పైలట్‌, అనుభవం లేకున్నా సేఫ్‌గా ల్యాండ్ చేసిన ప్రయాణికుడు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Island Free Press (@islandfreepress)

Published at : 12 May 2022 07:42 PM (IST) Tags: north carolina House Collapses into sea house collapses into ocean House Collapse into Sea

సంబంధిత కథనాలు

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

Kids Fever: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి

Kids Fever: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి

Corona Virus: ఈ లక్షణాలు కరోనా వైరస్‌వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు

Corona Virus: ఈ లక్షణాలు కరోనా వైరస్‌వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు

టాప్ స్టోరీస్

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో  - ఎవరికంటే?

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?

Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?