News
News
X

ఆయుర్వేదం ప్రకారం లైంగిక శక్తిని పెంచే ఆహారం ఏమిటీ? శృంగారానికి బెస్ట్ సీజన్ ఏది?

శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతోంది ఆయుర్వేద శాస్త్రం.

FOLLOW US: 

శృంగారం గురించి బయట మాట్లాడాలంటే ఇప్పటికీ చాలా మంది సిగ్గుపడతారు. అదొక బూతు అన్నట్లుగా చూస్తారు. పెద్ద వాళ్ళు అయితే సంప్రదాయ బద్ధంగా లేకుండా ఏమిటా మాటలు అని తిట్టుకుంటూ అసహ్యించుకుంటారు. నిజానికి శృంగారం అనేది ఒక పవిత్రమైనదని పూర్వీకులే చెప్తున్నారు. అందుకు నిదర్శనమే కొన్ని పురాతన దేవాలయాలపై కనిపించే బొమ్మలు. అయితే ఇది నలుగురి మధ్య కాకుండా నాలుగు గోడల మధ్య జరిగే అద్భుత కార్యం. జీవితానికి మద్దతు ఇచ్చే మూడు స్తంభాల్లో శృంగారం కూడా ఒకటి. ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది. సెక్స్, సంతానోత్పత్తి ఆనందంతో ముడిపడి ఉన్నప్పటికీ అది సంపూర్ణ ఆరోగ్యం కూడా ఇస్తుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి దరి చేరవని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. పురాతన భారతీయ వైద్య విధానం ప్రకారం ఆరోగ్యకరమైన శృంగారం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అవేంటంటే..

⦿ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది

⦿ ఆరోగ్యకరమైన జ్ఞాపకశక్తిని పెంచుతుంది

⦿ లాంగ్ లైఫ్, శరీరానికి బలం

⦿ మేధో సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం శృంగారం చెయ్యడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో శృంగారానికి అనువైన సమయం ఉంది. చలి కాలంలో చెయ్యడం వల్ల భార్యాభర్తలు సంతోషంగా దాన్ని ఆస్వాదించగలరంట. అదే వేసవిలో అయితే దానికి దూరంగా ఉండటమే మంచిదని ఆయుర్వేదం చెప్తోంది. ఇక వర్షాకాలంలో శరీర బలం తక్కువగా ఉంటుంది. కనుక 15 రోజులకి ఒకసారి శృంగారంలో పాల్గొనవచ్చు. అది ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆయుర్వేదంలో శృంగారానికి సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

⦿ భోజనం జీర్ణమైన తర్వాత మాత్రమే శృంగారంలో పాల్గొనండి.

⦿ ఖాళీ కడుపుతో ఎప్పుడూ సెక్స్ చెయ్యకూడదు.

⦿ ఇబ్బందికరమైన భంగిమల్లో శృంగారం చేయడం వల్ల మైకం, అలసట వస్తాయి.

⦿ బాగా స్నానం చేసి, భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆ పని చెయ్యాలి.

⦿ శృంగారంలో పాల్గొన్న తర్వాత స్నానం చెయ్యాలి లేదా పాలు, చక్కెరతో చేసిన స్వీట్స్ తినాలి

⦿ చల్లటి నీళ్ళు, మాంసం సూప్, పచ్చి శెనగల సూప్ కూడా తీసుకోవచ్చు.

⦿ శృంగారం చేసిన తర్వాత కొద్ది సేపు నిద్రపోవాలి.

లైంగిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. అందుకే కొన్ని ఉత్తమమైన ఆహార పదార్థాలను ఆయుర్వేదం సూచిస్తుంది.

⦿ నెయ్యి

⦿ ఎర్ర బియ్యం

⦿ సీతాఫలం

⦿ పాలు

⦿ బాదంపప్పు లేదా బాదంపాలు

⦿ అన్నం గంజి

ఇవే కాదు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. అందుకోసం యోగా చెయ్యొచ్చు. యోగా వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఒత్తిడిని దూరం చేసి రోజంతా మిమ్మల్ని రిలాక్స్‌గా ఉండేలా చేస్తాయి. ఏకాగ్రత కూడా లభిస్తుంది. యోగా మీ ఇంద్రియ, మానసిక, శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. యోగా ఆరోగ్యానికే కాదు.. శృంగారానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.   

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి

Also Read: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి

Published at : 09 Sep 2022 03:54 PM (IST) Tags: Healthy life best food Ayurveda Sex Sex Health Benefits Best Food For Sexual Health

సంబంధిత కథనాలు

Michigan Lottery: భార్య చెప్పిన మాట వింటే ఇదిగో ఇలా రూ. 1.5 కోట్ల లాటరీ గెలవొచ్చు!

Michigan Lottery: భార్య చెప్పిన మాట వింటే ఇదిగో ఇలా రూ. 1.5 కోట్ల లాటరీ గెలవొచ్చు!

Gandhi Jayanti: మహాత్మా గాంధీ డైట్ ప్లాన్ వెరీ వెరీ స్పెషల్! శరీరానికే కాదు, మానసిక శక్తిని అందిస్తుంది

Gandhi Jayanti: మహాత్మా గాంధీ డైట్ ప్లాన్ వెరీ వెరీ స్పెషల్!  శరీరానికే కాదు, మానసిక శక్తిని అందిస్తుంది

Blood Diamonds: ఆ దేశంలో వజ్రాలు విరివిగా దొరకుతాయి! అయినా, నిత్యం ఆకలి చావులు, అనుక్షణం భయం భయం!!

Blood Diamonds: ఆ దేశంలో  వజ్రాలు  విరివిగా దొరకుతాయి! అయినా, నిత్యం ఆకలి చావులు, అనుక్షణం భయం భయం!!

పెళ్లయిన తొలిరాత్రి భార్యాభర్తలు పాలు తాగడం వెనుక అసలు లాజిక్ ఇదే

పెళ్లయిన తొలిరాత్రి భార్యాభర్తలు పాలు తాగడం వెనుక అసలు లాజిక్ ఇదే

మీ ముఖంలో ఈ మార్పులు వచ్చాయా? థైరాయిడ్ ఏమో చెక్ చేసుకోండి

మీ ముఖంలో ఈ మార్పులు వచ్చాయా? థైరాయిడ్ ఏమో చెక్ చేసుకోండి

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా