By: ABP Desam | Updated at : 27 Mar 2022 08:01 AM (IST)
Edited By: harithac
(Image credit: Pexels)
టీనేజీకి పిల్లలు వస్తున్నారంటే చాలు మొదట వచ్చే సమస్య మొటిమలు. చర్మం నిగనిగలాడాలని కోరుకునే వయసులో వారిని ఈ యాక్నే సమస్య కుంగదీస్తుంది. వీటికి రకరకాల క్రీముల్లాంటివి రాస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. నిజానికి మొటిమలు క్రీములకు లొంగవు. అవి త్వరగా తగ్గాలంటే మొటిమలున్నప్పుడు కొన్ని రకాల ఆహారాలను తగ్గిస్తే అవి త్వరగా పోతాయి.
చక్కెర
చక్కెరను నేరుగానే కాదు సోడాలు, టెట్రా ప్యాక్ జ్యూస్‌లు, తేనె... ఇలా రకరకాల పదార్థాల రూపంలో తీసుకుంటాము. చక్కెర త్వరగా రక్తప్రవాహంలోకి చేరుకుంటుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరిగిపోతాయి. అదనపు చక్కెరను కణాల్లోకి నెట్టివేస్తుంది. దీని వల్ల మొటిమలు అధికంగా వస్తాయి.
పాల ఉత్పత్తులు
పాలు వల్ల మొటిమలు వస్తాయని ఎక్కడా ఆధారాల్లేవు. వాటి మధ్య బంధం ఇంకా నిరూపించలేదు. కానీ పాల వినియోగం తరువాత మొటిమలు అధికమవుతున్నట్టు అనిపిస్తే మాత్రం వాటికి దూరంగా ఉండడం మంచిది. కొందరిలో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు.
ఫాస్ట్ ఫుడ్
బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకునే టీనేజర్లకు అధికంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తగ్గించుకోవాలి.
చాకోలెట్
తియ్యని కోకోను తినేవారిలో మొటిమలు పెరుగుతాయని నిరూపణ అయ్యింది. చాక్లెట్ తయారీలో కోకో పొడి, పాలు కచ్చితంగా వాడతారు. ఇది తింటే రోగనిరోధక వ్యవస్థ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టిరియాపై తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నట్టు అధ్యయనం నిరూపించింది.
ఆయిలీ ఫుడ్
వేయించిన ఆహారాలు, బర్గర్లు వంటి వాటిలో చాలా ఆయిల్ ఉంటుంది. అలాగే మాంసాహారంలో అదనంగా కొవ్వు కూడా ఉంటుంది. ఈ నూనె, కొవ్వుల వల్ల మొటిమలు అధికంగా వస్తాయి.
శుద్ధి చేసిన ధాన్యాలు
శుద్ధి చేసిన ధ్యాన్యాల, పిండితో తయారుచేసే రొట్టెలు, పాస్తా, నూడుల్స్ వంటివి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ను సూచిస్తాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల ఇన్సులిన్ ఆండ్రెజెన్ హార్మోన్లను మరింత చురుగా పనిచేసేలా చేస్తుంది. ఇది వేగంగా కణాల పెరుగుదలకు కారణమై సెబమ్ ఉత్పత్తికి దారితీస్తుంది. ఈ పరిస్థితి మొటిమలు రావడానికి కారణమవుతుంది.
మాంసాహారం...
కొందరిలో మొటిమలు తీవ్రస్థాయిలో ఉంటాయి. చెంపలై నుంచి నుదురు, గడ్డం మీద కూడా వస్తాయి. చికెన్, మటన్ వంటి మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడమే దీనికి కారణం. మాంసాహారాన్ని తగ్గిస్తే మొటిమలు రావడం తగ్గుతుంది.
ఈ నిజాలు తెలుసా?
1. ప్రపంచంలో పది శాతం మంది తీవ్ర మొటిమల సమస్యతో బాధపడుతున్నారు.
2. చక్కెర అధికంగా ఉండే ఆహారం తినేవారికి మొటిమలు వచ్చే అవకాశం 30 శాతం అధికం.
3. కేకులు, పేస్ట్రీలు అధికంగా తింటే మొటిమలు వచ్చే అవకాశం 20 శాతం పెరుగుతుంది.
4. డార్క్ చాక్లెట్ ను రోజూ తినడం వల్ల కూడా మొటిమలు వస్తాయి.
5. మహిళలు, బాలికల్లో తమ పీరియడ్స్ కు రెండు నుంచి ఏడు రోజుల ముందు హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గుల వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది.
Also read: కరోనా టీకా భుజానికే ఎందుకు వేస్తారు? నరాలకు కాకుండా కండరాలకే సూది ఎందుకు గుచ్చుతారు?
Also read: తల్లిపాలతో నగలు తయారుచేస్తున్న జంట, కోట్ల రూపాయల్లో సాగుతున్న వ్యాపారం
Health Benefits Of Peanuts : పల్లీలు తింటూ బరువు తగ్గిపోవచ్చా? చలికాలంలో తప్పకుండా తినాలా?
Magnesium Deficiency: రక్తంలో మెగ్నీషియం లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే - బీ కేర్ఫుల్!
Kidney Problems: ‘క్రియాటినిన్’ అంటే ఏమిటీ? మాంసాహారం తింటే కిడ్నీలు పాడవుతాయా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Earplugs Side Effects : ఇయర్ఫ్లగ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు నరకం చూపిస్తాయి
World Aids Day: HIV కి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్కు పూనకాలే
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
/body>