IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

World Cancer Day: క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? వైద్యులు ఏమంటున్నారు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

FOLLOW US: 

క్యాన్సర్..! దీని పేరు వింటే చాలు.. కాళ్లు, చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన నాటి నుంచి.. చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. చికిత్స తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తిరిగి ఆరోగ్యంగా మారాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. క్యాన్సర్ అనేది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాధుల బారిన పడి చనిపోతున్న వారిలో క్యాన్సర్‌ ది రెండో స్థానం. వ్యాధి అంతకంతకూ పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకు పైగా క్యాన్సర్‌ వ్యాధి రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా పలు రకాల క్యాన్సర్లు గుర్తించబడ్డాయి. ఏటా వీటి బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు 13 లక్షలకు పైనే అని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొన్ని దశల్లో క్యాన్సర్ ప్రాణాలను సైతం బలి తీసుకుంటూ మానవాళిపై దాడి చేస్తోంది.

శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుంది. అయితే, శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే, శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయి. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్ గా ఏర్పడతాయి. దాన్నే క్యాన్సర్ అని అంటారు.

మన దేశంలో క్యాన్సర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత గుర్తిస్తుండడంతో పరిస్థితి చేయి దాటిపోతోంది. ముందుగానే గుర్తిస్తే దాని బారిన నుంచి త్వరగా బయటపడే ఛాన్స్ ఉంది. క్యాన్సర్ సోకిన తర్వాత స్టేజ్-1, స్టేజ్-2 లలో గుర్తిస్తే.. దాన్ని నయం చేసే వైద్యం అందుబాటులో ఉంది. ఈ రెండు స్టేజ్‌లలో గుర్తించి ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటే దాదాపు 90 శాతం నయమయ్యే అవకాశముందని డాక్టర్లు చెప్తున్నారు. స్టేజ్‌-4లో గుర్తిస్తే.. వ్యాధి 22 శాతం నయమయ్యే ఛాన్స్‌ ఉందంటున్నారు. క్యాన్సర్‌ ను గుర్తించేందుకు ప్రస్తుతం ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ప్రత్యేక స్ర్కీనింగ్ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఖచ్చితమైన చికిత్స, వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా వ్యూహాత్మక చికిత్సా విధానాలను అవలంభిస్తుండడంతో క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెడుతున్నారు డాక్టర్లు. వ్యాధి తీవ్రత పెరిగిన వారితో పోల్చితే త్వరగా గుర్తించిన వారికి జీవించే అవకాశం ఎక్కువ. వ్యాధి తీవ్రత తగ్గడంతో పాటు క్వాలిటీ లైఫ్‌ ని లీడ్ చేసే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు.

లక్షణాలను బట్టి ఏ క్యాన్సర్‌ అనేది గుర్తించే పద్ధతులు కనుగొనబడ్డాయి. క్లినికల్, మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, ల్యాబొరేటరీ టెస్టుల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తున్నారు. స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్, డిజిటల్ మామోగ్రఫీ, ట్రూ-కట్ బయాప్సీ, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, పీఈటీ స్కాన్, ఎంఆర్‌ స్పెక్ట్రోస్కోపీ వంటి అధునాతన పద్ధతుల ద్వారా క్యాన్సర్‌ ను గుర్తిస్తున్నారు. వీటితో పాటు ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ, ఇన్ సిటు హైబ్రిడైజేషన్, రియల్ టైమ్ పీసీఆర్, ఫ్లో సైటోమెట్రీ, మైక్రో అరే, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, లిక్విడ్ బయాప్సీ వంటి పద్ధతులు కూడా క్యాన్సర్‌ నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత సర్జన్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇతర వైద్య నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ టీమ్‌ ద్వారా చికిత్స పొందవచ్చు. క్యాన్సర్ రకం, దాని దశ, రోగి స్టేజ్‌ ని బట్టి చికిత్స విధానాలు ఉన్నాయి. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సా విధానాలతో క్యాన్సర్‌ కొంత అదుపులోకి వస్తోంది. సర్జరీ అవసరం లేని చికిత్సతో పాటు.. ఒకవేళ సర్జరీ చేయాల్సి వచ్చినా.. ఎలాంటి నొప్పి, బాధ లేకుండా చేసే చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఏదైనా అవయవానికి క్యాన్సర్ సోకితే.. ఆ పార్ట్‌ ని మొత్తం తీసేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడలా కాదు.. వ్యాధి సోకిన ప్రాంతాన్ని మాత్రమే తీసేసి.. మిగతా ప్రాంతానికి మళ్లీ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స అందిస్తున్నారు వైద్య నిపుణులు. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌ సోకితే రొమ్మును పూర్తిగా తొలగించేవారు. మారిన చికిత్సా విధానాలతో ప్రస్తుతం రొమ్మును పూర్తిగా తొలగించకుండా కేవలం క్యాన్సర్‌ కణితులు ఉన్న ప్రాంతాన్నే సర్జరీ చేసి తీసేసి.. మళ్లీ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. పొత్తి కడుపు క్యాన్సర్‌ కోసం ఇంకో చికిత్సా విధానం కనుగొన్నారు నిపుణులు. రెండు దశల్లో చేసే హైపర్‌ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమో థెరపీ సర్జరీ పొత్తి కడుపులోని క్యాన్సర్‌ ను సమూలంగా నిర్మూలిస్తోంది. క్యాన్సర్ కణాలను చంపడం, దాని ఎఫెక్ట్‌ ని తగ్గించడంతో పాటు శరీరంపై విష పదార్థాలను తీసేసేందుకు కీమో థెరపీ చేస్తున్నారు. ఈ రకమైన చికిత్సా విధానాలు క్యాన్సర్‌ ట్రీట్‌ మెంట్‌ లో పెను సంచలనం సృష్టించాయి. 

సాధారణంగా క్యాన్సర్‌ సోకినప్పుడు చాలా రకాల చికిత్సా విధానాలు అవసరమవుతాయి. వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన జీన్ సీక్వెన్సింగ్‌ ద్వారా అందించే చికిత్స మంచి రిజల్ట్ ఇస్తోంది. కొన్నాళ్లుగా రేడియేషన్‌ చికిత్స కూడా మంచి పురోగతి సాధిస్తోంది. శరీరంలో ఉన్న క్యాన్సర్‌ కణాలను టార్గెట్‌ చేసే రేడియేషన్‌ క్యాన్సర్ కణాలను సమూలంగా తుడిచి పెట్టేస్తోంది. క్యాన్సర్‌ సోకిన బాడీని బట్టి, స్టేజ్‌ను బట్టి డాక్టర్లు ఈ రేడియేషన్‌ చికిత్సా విధానాలను అమలు ఎంచుకుంటారు.

కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆంకాలజీ సేవలను దెబ్బతీసింది. దీంతో డాక్టర్లు కొత్త మార్గాలను అనుసరించడంతో పూర్తి సేఫ్టీగా ట్రీట్‌ మెంట్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టెలీ మెడిసిన్, కౌన్సెలింగ్, మందులను సూచించడం, రిమోట్ మానిటరింగ్‌ ద్వారా ట్రీట్‌ మెంట్‌ చేసే మార్గాలను కనుగొన్నారు. చికిత్స కోసం ప్రతీసారి హాస్పిటళ్లకు వచ్చే అవసరం లేకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా రోగి సేఫ్టీగా ఉండే విధానాలను అనుసరిస్తున్నారు. 

“అవసరం.. కొత్త ఆవిష్కరణలు కనుగొనేలా చేస్తుంది’’. దీంతో కరోనా కాలంలోనూ చికిత్సా విధానంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం క్యాన్సర్ కంట్రోల్‌ లోనే ఉన్నా.. రాబోయే కాలంలో అంతా కలిసికట్టుగా ఉంటే క్యాన్సర్‌పై విజయం సాధించవచ్చు.


డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ
డైరెక్టర్ & చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్
రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, కార్ఖానా, సికింద్రాబాద్

Published at : 04 Feb 2022 06:44 AM (IST) Tags: Cancer Factors క్యాన్సర్ World Cancer day Cancer Day How to prevent Cancer

సంబంధిత కథనాలు

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Keema Recipe: దాబా స్టైల్‌లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం

Keema Recipe: దాబా స్టైల్‌లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం

Clay Pot: ఫ్రిజ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

Clay Pot: ఫ్రిజ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!