By: ABP Desam | Updated at : 11 May 2023 04:21 PM (IST)
Image Credit: Pexels
మొహం కడుక్కోవడానికి ఇంట్లో పనులు చేసుకోవడానికి సాధారణంగా కుళాయిలో వచ్చే నీటిని వినియోగిస్తారు. బయట నుంచి రాగానే ట్యాప్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకునే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. వేడి వాతావరణం నుంచి వచ్చిన తర్వాత చల్లని నీటితో మొహం శుభ్రం చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది. అయితే మీకోక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పమంటారా? కుళాయి నీటితో ముఖం కడుక్కోవడానికి సరైన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు. హార్డ్ వాటర్ లోని ఖనిజాలు రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల చర్మం పొడిబారిపోతుంది. ఫలితంగా మొటిమలు, తామర, సోరియాసిస్ ను ప్రేరేపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా వంట పాత్రలు శుభ్రం చేసుకోవడానికి ఇంటి పనులకు ఉపయోగించే కుళాయి నీటిలో ఇనుము, జింక్, మెగ్నీషియం, రాగి, కాల్షియం ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. అయితే హార్డ్ వాటర్ లో మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. వైద్యులు చెప్పే దాని ప్రకారం ఈ నీరు చర్మ అవరోధానికి ఆటంకం కలిగిస్తుంది. చర్మంలోని సహజ నూనెలను కోల్పోయేలా చేసి పొడిగా మార్చేస్తుంది. హార్డ్ వాటర్ తో ఫేస్ క్లీన్ చేసుకునేటప్పుడు క్లెన్సర్, సబ్బులు కలిపినప్పుడు అందులోని అవశేషాలు రంధ్రాలని అడ్డుకుంటాయి. సున్నితమైన చర్మం కలిగిన వారికి ఈ ట్యాప్ వాటర్ మరింత హాని చేస్తాయి.
ట్యాప్ వాటర్ వల్ల అనార్థాలు
చర్మ మైక్రోబయోమ్ ల గురించి ఇటీవలి కాలంలో చర్మ నిపుణులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి ముఖం, శరీరంపై ఉంటాయి. ఫిల్టర్ చేయని నీరు చర్మం మీద ఉండే మంచి బ్యాక్టీరియాకు భంగం కలిగిస్తుంది. తామర, మొతమలు, చర్మ వ్యాధులను తీవ్రతరం చేస్తాయి. ఈ నీటి వల్ల చర్మం పెళుసుగా, పొడిగా మారుతుంది. వడకట్టని నీటి వల్ల జుట్టు కూడా దెబ్బ తింటుంది. ఫేస్ వాష్ కి సురక్షితమైన ఎంపిక ఫిల్టర్ చేయబడిన నీళ్ళు. వడపోత ప్రక్రియ మంటను కలిగించే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది.
నీళ్లే కాదు సబ్బు ప్రమాదమే
జిడ్డుగా ఉందని ఎక్కువ మంది పదే పదే సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటారు. ఇదొక చెత్త ఐడియా అని నిపుణులు అంటున్నారు. రోజూ సబ్బుతో కడగటం వల్ల చర్మం పొడి బారిపోతుంది. అందులోని రసాయనాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా సబ్బు వాడటం వల్ల చర్మం మీద ఉండే సూక్ష్మజీవులను చంపేస్తుంది. రంధ్రాలలో సబ్బు తాలూకూ సమ్మేళనాలు చేరి మూసుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల బ్లాక్ హెడ్స్, బ్రేక్ అవుట్స్, ఇన్ఫెక్షన్లు మొదలైన సమస్యలకు దారి తీస్తుంది. అలాగే చర్మానికి అవసరమయ్యే విటమిన్లని తొలగిస్తుంది. సబ్బుతో కాకుండా క్రీమ్, జెల్ క్లెన్సర్ తో మొహం శుభ్రం చేసుకుంటే చర్మానికి ఎటువంటి హాని కలగకుండా సహజమైన మెరుపు ఇస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: హిమాలయాల్లోని ఈ పువ్వుల రసం తాగితే ఎలాంటి రోగాలైనా నయమవుతాయా?
ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!
Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు
Heatstroke: సమ్మర్ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే
Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!