Buransh Flower: హిమాలయాల్లోని ఈ పువ్వుల రసం తాగితే ఎలాంటి రోగాలైనా నయమవుతాయా?
లేత గులాబీ రంగులో ఉండే బురాన్ష్ పువ్వులు హిమాలయ కొండల్లో లభిస్తాయి. ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి.
ఎర్రగా కనిపించే ఈ పువ్వు చాలా పురాతనమైనది. ఉత్తరాఖండ్, హిమాచల్ లోని కొండ ప్రాంతాల్లో కనిపించే అద్బుతమైన రహస్యాలు ఈ పువ్వులో ఉన్నాయి. దీన్నే బురాస్ చెట్టు లేదా బుర్షాన్ చెట్టు అని కూడా పిలుస్తారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఎన్నో యుగాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. మాయా పుష్పంగా ప్రసిద్ధి చెందింది.
బురాన్ష్ అంటే ఏమిటి?
బురాన్ష్ చెట్టుని రోడోడెండ్రాన్ అని కూడా పిలుస్తారు. గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం రోజీ ఎరుపు. ప్రకృతి ఆశీర్వాదం నుంచి వచ్చినవి ఈ ఎరుపు గులాబీ పువ్వులు. దీన్ని క్రీమ్సన్ పువ్వుగా కూడా పిలుస్తాడు. శకథవంతమైన ఔషధ, చికిత్స గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని స్క్వాష్, జ్యూస్ గా చేసుకుని తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
బురాన్ష్ ప్రయోజనాలు
బురాన్ష్ పువ్వు సహజంగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలతో నిండి ఉంటుందట. చాలామంది దీన్ని రసంగా తీసుకుంటారు. మంట, కాలేయ వ్యాధులను నయం చేయడానికి, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. బ్రోన్కైటిస్, గ్రౌట్‌ను తగ్గిస్తుంది. ఈ పువ్వు రసం అనేక రకాల క్యాన్సర్ల పెరుగుదలను నిరోధించడంలో శక్తివంతంగా పని చేస్తుంది. ఈ పువ్వు స్క్వాష్, రసం ఇన్సులిన్ అసమతుల్యతను పరిష్కరిస్తుంది. చర్మం, గుండె, కాలేయ సమస్యలను నయం చేసే ప్రసిద్ధ లక్షణాలు ఇందులో ఉన్నాయి.
అనేక యుగాల నుంచి ఆయుర్వేదం, హోమియోపతి ఔషధాలలో బుర్షాన్ క్రియాశీల పదార్థంగా ఉపయోగించబడుతోంది. కానీ ఈ పువ్వుకి ఉన్న ప్రకాశవంతమైన రంగు కారణంగా ఇది ఫేమస్ అయ్యింది. యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది. SARS-CoV 2 కోసం వ్యాక్సిన్‌ను రూపొందించడంలో ఉపయోగించబడింది. హిమాలయాల్లోని అరుదైన, అంతరించిపోతున్న మొక్కలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జీవశాస్త్రవేత్తల బృందం అధ్యయనం జరిపారు. అప్పుడే ఈ పుష్పాన్ని గుర్తించారు. ఇందులో యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు శక్తివంతమైన నివారణగా ఉపయోపగపడుతుందని గుర్తించారు.
ఇంట్లోని బురాన్ష్ జ్యూస్ తయారు చేయడం ఎలా?
ఈ పువ్వుతో ఇంట్లోనే రుచికరమైన, నోరూరించే బురాన్ష్ రసం చేసుకోవచ్చు. చక్కెర రహితంగా దీని తయారు చేసుకోవచ్చు. ముందుగా బురాన్ష్ పువ్వులను నీటిలో కడిగి నానబెట్టాలి. వేరొక పాత్ర తీసుకుని అందులో నీటిని తీసుకుని వెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత బురాన్ష్ పువ్వులు వేసి నీరు గులాబీ రంగులోకి వచ్చే వరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
మిశ్రమం సగానికి తగ్గే వరకు కలుపుతు ఉండాలి. ఆ తర్వాత వడకట్టాలి. చల్లారిన తర్వాత గ్లాసులోకి తీసుకుని అందుకో కాస్త తేనె లేదా స్టెవియా కలుపుకుని తీసుకోవచ్చు.
స్క్వాష్ తయారీ
ఇంట్లో బురాన్ష్ స్క్వాష్ చేయడానికి పువ్వులు తీసుకుని చక్కెర సిరప్ తో కలపాలి. దీన్ని చల్లబరిచేందుకు అందులో కాస్త చల్లని నీళ్ళు కలుపుకోవచ్చు. రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసుకుని ఎప్పుడైనా తాగొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: సమ్మర్ లో ఐస్ క్రీమ్ తింటున్నారా? జాగ్రత్త ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఎక్కువే