Food Poisoning: సమ్మర్ లో ఐస్ క్రీమ్ తింటున్నారా? జాగ్రత్త ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఎక్కువే
ఆకుకూరలు, కూరగాయాలతో చేసే సలాడ్, మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. కానీ మీకు తెలుసా వీటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
వేసవిలో చల్లచల్లని ఐస్ క్రీమ్ తినడం అంటే చాలా మందికి ఇష్టం. కానీ మీకు తెలుసా దీన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని. సమ్మర్ లో వేడి గాలుల కంటే ఆహారం వల్ల వచ్చే అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఆహారాలు హానికరమైన సూక్ష్మక్రిములను కలిగి ఉంటాయి. అవి ఆహారాన్ని కలుషితం చేసి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. సెంటర్స్ ఫర్ డీసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రకారం మాంసాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కలిగిస్తాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆరోగ్యం అనుకునే కొన్ని ఆహారాలు అనూహ్యంగా అనారోగ్యాన్ని తెచ్చి పెడతాయి.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో సంవత్సరానికి 48 మిలియన్ల ఆహార సంబంధిత అనారోగ్య కేసులు నమోదవుతున్నాయి. ఏటా ఈ అనారోగ్యాల వల్ల 1,28,000 మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇంకా 3 వేల మంది మరణిస్తున్నారు. అనారోగ్యాన్ని కలిగించే ఆహారాల జాబితాలో కొన్ని ఇవి.
ఐస్ క్రీమ్
వేసవి కాలంలో ఐస్ క్రీమ్ తినకుండ ఎవరూ ఉండలేరు. కానీ ఇది మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని వైద్యులు అంటున్నారు. దీనిలో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఇ.కోలి, లిస్టేరియా వంటి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ వేసవి వేడి ఉష్ణోగ్రతలో వృద్ధి చెందుతాయి. ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. లిస్టేరియా బ్యాక్టీరియాయ అయితే ఫ్రీజర్ లో సున్నా లేదా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుని జీవించగలదు. ఇది ఇతర ఆహార పదార్థాల ఉపరితలాల మీదకు సులభంగా వ్యాపిస్తుంది. కరిగిన ఐస్ క్రీమ్ ఎప్పుడు రీఫ్రీజ్ చేయకూడదని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఒక వేళ ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు గుడ్డు లేని వంటకాన్ని ఉపయోగించమని వైద్యులు సలహా ఇస్తున్నారు.
మొలకలు
మొలకెత్తిన గింజలు ఆరోగ్యాన్ని ఇస్తాయని చాలా మంది నమ్ముతారు. అల్ఫాల్ఫా, ముంగ్ బీన్, క్లోవర్, ముల్లంగి మొలకలతో సహా అన్ని రకాల మొలకలు వాటి విత్తనాల బ్యాక్టీరియా కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్ ని వ్యాప్తి చేస్తాయి. పచ్చి మొలకలు పోషకాహారం, ఆరోగ్యంతో కూడిన సూపర్ ఫుడ్ అయినప్పటికీ ఇ.కోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందే వెచ్చని, తేమతో కూడిన పరిస్థితులలో అవి పెరుగుతాయి.
US FDA ప్రకారం ప్రతి సంవత్సరం పచ్చి మొలకలు నుండి కనీసం 148 ఆహారపదార్థాల వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అందువల్ల తినడానికి ముందు మొలకలను ఎల్లప్పుడూ కాల్చడం లేదా వేడి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సలాడ్
సలాడ్ ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేలా చేసే పోషకాలతో లోడ్ చేయబడి ఉంటాయి. కానీ సలాడ్ కలుషితానికి అతి పెద్ద మూలం పాలకూర. లెట్యూస్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఎరువు వేసి పండించిన పాలకూరలో జంతువు మలం నుంచి వచ్చే బ్యాక్టీరియా సలాడ్ లో చేరుతుంది. CDC ప్రకారం, కొన్నిసార్లు ఆకు కూరలపై కనిపించే హానికరమైన సూక్ష్మక్రిములు సాల్మొనెల్లా, ఇ.కోలి, లిస్టేరియా ఇవన్నీ ప్రాణాంతకం కావచ్చు. సూపర్ మార్కెట్ల నుంచి సలాడ్ కొనుక్కోవడం కంటే ఇంట్లోనే వండిన సలాడ్ తినమని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఆకుకూరలని కనీసం 2-3 నిమిషాలపాటు కడగాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: భోజనం చేసిన తర్వాత ఆకలిగా అనిపిస్తుందా? అందుకు ఈ పరాన్నజీవులే కారణం