News
News
వీడియోలు ఆటలు
X

Hair Color: తెల్ల జుట్టుకి ఇవి అప్లై చేశారంటే మీకు కావాల్సిన రంగులోకి జుట్టు మారిపోతుంది

జుట్టుకి నచ్చిన రంగు వేయించుకోవడానికి పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టుకి అందమైన రంగు వచ్చేలా చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

మధ్య కాలంలో జుట్టు నెరిసిపోవడం ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య. ఒత్తిడి, ధూమపానం, విటమిన్లు, మినరల్స్ లోపించిన పేలవమైన ఆహారం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి వ్యాధుల కారణంగా జుట్టు తెల్లగా మారిపోతుంది. జుట్టుకు రంగుని ఇచ్చే మెలనిన్ అనేది క్షీణించడం వల్ల జుట్టు నెరిసిపోతుందని పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల హెయిర్ ఫోలికల్స్ దెబ్బతింటాయి. లేదంటే చనిపోతాయి. దాని వల్ల జుట్టు నెరిసిపోతుంది.

వృద్ధాప్యంలో జుట్టు రంగు మారిపోవడం సహజమే. అటువంటి సమయంలో వెంట్రుకలు నల్లగా మార్చుకోవడం కష్టం. కానీ చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయితే మాత్రం వాటిని సహాజసిధ్దంగా చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నిద్ర వంటికి జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉన్న ఉత్పత్తులు ఉపయోగించొచ్చు. తెలుపు రంగు జుట్టుని మార్చుకునేందుకు ఇంట్లోనే దొరికే వాటితో సింపుల్ చిట్కాలు పాటించి చూడండి. మీ జుట్టు నల్లగా నిగనిగలాడిపోతుంది.

కాఫీ: బ్రూ కాఫీ చేసుకుని అది చల్లారిన తర్వాత జుట్టుకి బాగా పట్టించాలి. గంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. కాఫీ జుట్టుకి ముదురు గోధుమ రంగుని ఇస్తుంది.

హెన్నా: చాలా మంది ఫాలో అయ్యే సింపుల్ చిట్కా తలకి హెన్నా పెట్టుకోవడం. కొంతమంది గోరింటాకు మెత్తగా నూరుకుని పెట్టుకుంటారు. మరికొంతమంది గోరింటాకు పొడిని వేడి నీళ్ళలో కలిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి కొన్ని గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇది జుట్టుకి కావాల్సిన పోషణ అందిస్తుంది. వెంట్రుకలు మృదువుగా మారేలా చేస్తుంది. తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. జుట్టుకు ఎరుపు, నారింజ రంగుని ఇస్తుంది.

సేజ్: బాగా మరిగించిన సేజ్ టీ తీసుకోవాలి. అది చల్లారిన తర్వాత జుట్టుకి పెట్టుకుని గంటపాటు అలాగే ఉంచాలి. సేజ్ జుట్టుకి ముదురు గోధుమ రంగుని అందిస్తుంది.  

చామంతి పూల టీ: చమోమిలే టీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు జుట్టుకి అందాన్ని ఇస్తుంది. టీ బాగా కాచి చల్లారిన తర్వాత జుట్టుకి పట్టించాలి. చామంతి పూల టీ జుట్టుకి లేత రంగుని అందిస్తుంది.

నల్ల వాల్ నట్స్: నల్ల వాల్ నట్ పెంకులను చూర్ణం చేసి వాటిని నీటిలో ఉడకబెట్టాలి. దీన్ని చల్లారనిచ్చి జుట్టుకి పట్టించాలి. నలుపు వాల్ నట్స్ ముదురు గోధుమ రంగుని ఇస్తాయి.

క్యారెట్ రసం: క్యారెట్లు అందానికి, కళ్ళకు చాలా మంచిది. అలాగే ఇది జుట్టుకి కూడా పోషణ ఇస్తుంది. కొన్ని క్యారెట్ల ఉడకబెట్టి రసం చేసుకుని జుట్టుకి రాసుకోవాలి. ఇది ఎరుపు, నారింజ రంగుని ఇస్తుంది.

రబర్బ్: రబర్బ్ వేర్లను నీటిలో వేసి మరిగించుకోవాలి. దాన్ని జుట్టుకు పట్టించాలి. రబర్బ్ జుట్టుకి ఎరుపు, గోధుమ రంగులోకి మారుస్తుంది.

ఇండిగో: ఇండిగో పౌడర్ ని వేడి నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని జుట్టుకి అప్లై చేయాలి. ఈ నీలిమందు జుట్టుకు ముదురు నీలం, నలుపు రంగుని అందిస్తుంది.

నిమ్మరసం: తాజా నిమ్మరసం జుట్టుకి రాసుకుంటే మంచిది. జుట్టుని మెరిసేలా చేస్తుంది. మంచి అందమైన రంగుని ఇస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు

Published at : 07 Apr 2023 10:00 AM (IST) Tags: White Hair Hair Care Hair Care Tips Hair Color

సంబంధిత కథనాలు

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..

పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన