అన్వేషించండి

Apple Halwa: క్యారెట్ హల్వాలాగే ఆపిల్ హల్వా, రుచి అదిరిపోతుంది

ఆరోగ్యకరమైన పండ్లలో ఆపిల్ కూడా ఒకటి. దీంతో స్వీట్ కూడా చేసుకోవచ్చు.

ఆపిల్‌ను తినితిని బోరుకోడుతోందా, అయితే ఓ రోజు ఇలా స్వీట్ రూపంలోకి మార్చుకోండి. ఆపిల్ తిన్నట్టు  ఉంటుందీ, నాలికకు కొత్త రుచి తగిలినట్టు అవుతుంది. క్యారెట్ హల్వా చేసుకున్నట్టే ఆపిల్‌తో కూడా హల్వా చేసుకోవచ్చు. రుచి కూడా అదిరిపోతుంది. రోజుకో ఆపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండొచ్చని చెబుతారు. అంత ఆరోగ్యకరమైనది ఈ పండు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. రోజూ ఆపిల్ తింటే బి కాంప్లెక్స్ లోపం ఏర్పడదు. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచడం, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. 

బరువు తగ్గేందుకు..
బరువు తగ్గాలనుకునే వారు ఆహార తినడానికి ముందు ఒక ఆపిల్ తినాలి. పొట్ట నిండినట్టుగా అయిపోయి ఆహారం చాలా తక్కువగా తింటారు. ఆపిల్‌లో కెలోరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. భోజనం చేసేముందు ఆపిల్ తినడం వల్ల 200 కెలోరీల ఆహారం తక్కువ తినే అవకాశం ఉంది. ఆహారం తినడానికి అరగంట ముందు ఆపిల్ తినాలి. 

గుండె ఆరోగ్యానికి కూడా ఆపిల్ మేలు చేస్తుంది. ఆపిల్ తినని మహిళలతో పోలిస్తే రోజూ తినే వారిలో గుండె వ్యాధులు వచ్చే అవకాశం 43 శాతం తగ్గినట్టు అధ్యయనాల్లో తేలింది. అదే పురుషుల్లో అయితే 19 శాతం తగ్గింది. అందుకే రోజు ఆపిల్ తినడం అలవాటు చేసుకోవాలి. 

ఆపిల్ హల్వా...
కావాల్సిన పదార్థాలు
ఆపిల్స్ - నాలుగు
చక్కెర - పావు కప్పు
నెయ్యి - నాలుగు స్పూనుల
జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్‌లు - గుప్పెడు
యాలకుల పొడి - చిటికెడు
వెనీలా ఎక్స్ ట్రాక్ట్ - ఒక స్పూను
కుంకుమ పువ్వు - నాలుగు రేకలు
(ఇది రంగు కోసం. కావాలంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకుంటే మానేయచ్చు)

తయారీ ఇలా
1. ఆపిల్‌ తొక్కను తీసేసి మిగతా భాగాన్ని బాగా తురుముకోవాలి. 
2. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి జీడిపలుకులు, బాదం పలుకులు, పిస్తా, కిస్మిస్‌లు వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 
3. కళాయిలో మిగిలిన నెయ్యిలో ఆపిల్ తురుమును వేసి వేయించలి. చిన్న మంట పెట్టుకోవాలి. లేకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. 
4. ఆపిల్ తురుములోని నీరుపోయి దగ్గరగా అయ్యాక చక్కెర, కుంకుమ పువ్వు వేసి కలపాలి. 
5. పంచదారంతా కరిగి తిరగి పాకంలా అయి హల్వా అంతా దగ్గరగా చేరుతుంది. అప్పుడు వెనీలా ఎక్స ట్రాక్ట్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. 
6. పైన ముందుగా వేయించి డ్రైఫ్రూట్స్ ను చల్లుకోవాలి. దీన్ని గోరువెచ్చగా తింటే భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. 

Also read: నలభై ఏళ్లు దాటిన వారు రోజుకో గుడ్డు తినాల్సిందే అంటున్న అధ్యయనాలు

Also read: ప్రేమించమని చెప్పడమే వాలెంటైన్‌కు శాపమైంది, ఉరికొయ్యకు వేలాడాల్సి వచ్చింది

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
Embed widget