అన్వేషించండి

Apple Cider Vinegar: యాపిల్ సిడర్ వెనిగర్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుంటున్నారా? అయితే కాస్త ఇబ్బందులు తెచ్చుకుంటున్నట్లే..

యాపిల్ సిడర్ వెనిగర్(ఏసీవీ).. ప్రస్తుతం ఇది అందరి ఇళ్ళల్లోను ఉంటుంది. డ్రెస్సింగ్, మెరినేట్స్, వంటకాల కోసమే కాదు బరువు తగ్గేందుకు కూడా దీన్ని తీసుకుంటున్నారు. అనేక వ్యాధులను నయం చేసే గొప్ప నివారణగా పని చేస్తుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి వస్తున్న వాటిలో ఎంతవరకు నిజం అనే దాని మీద ప్రత్యేక అధ్యయనాలు ఏమి లేవు.

ఏసీవీలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. అయితే ఇటీవల వచ్చిన కొన్ని అధ్యయనాలు ఇకోలి బ్యాక్టీరియాను తగ్గిస్తున్నట్టు నిర్థారించాయి. అంతే కాదు అంటు వ్యాధులని తగ్గించడంలో ఇదొక్కటే పరిష్కారం కాదని మరో అధ్యయనం పేర్కొంది. యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుంటే బరువు తగ్గడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే కొన్ని మాత్రం ఈ వెనిగర్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య, కొవ్వు కరిగించడం, గ్లూకోజ్ పెరుగుదల నియంత్రణలో సహాయపడుతుందని నిర్ధారిస్తుంది. ఈ కారకాలు పరోక్షంగా బరువు తగ్గడాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే బరువు తగ్గడానికి వ్యాయామం, డైట్ పాటించకుండా కేవలం యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుంటే మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు.

యాపిల్ సిడర్ వెనిగర్ వల్ల అనార్థాలు

ఏసీవీలో అధిక స్థాయి ఆమ్లత్వం కారణంగా గర్భిణీ లేదా పాలిచ్చే తల్లులకు ఎంత మాత్రం సురక్షితం కాదు. దంతాల మీద ఎనామిల్ దెబ్బతింటుంది. ఎలుకల మీద జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ఏసీవీని తీసుకున్న తర్వాత ఎనామిల్ లో క్షీణతను పరిశోధకులు గుర్తించారు. కానీ మనుషులకి సంబంధించి మాత్రం ఎటువంటి ధృవీకరణ లేదు. యాపిల్ సిడర్ వెనిగర్ కూడా పలుచగా చేసిన తర్వాత తీసుకున్నంత వరకు అది సురక్షితమే.

చాలా కొద్ది మందిలో మాత్రమె యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుంటే అజీర్ణానికి కారణం అవుతుంది. ఇది తీసుకున్న తర్వాత వికారంగా అనిపిస్తుంది. అధిక స్థాయి ఆమ్లత్వం కారణంగా మరి కొంతమందికి చికాకు కలిగిస్తుంది. అందుకే వినియోగానికి ముందు తగినంత నీటిలో కరిగించి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. 1 టీ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ ని గ్లాసు నీటిలో వేసి కరిగించాలి. భోజనానికి కనీసం 15-20 నిమిషాల ముందు దీన్ని తాగడం మంచిది.  

జీర్ణక్రియ సమస్యలు

ఆహారం తీసుకున్న వెంటనే యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియ సమస్యలకి కారణమవుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కూడ చేస్తుంది. రోజుకి రెండు స్పూన్లకి మించి తీసుకోకూడదు. నిద్ర పోయే ముందు కూడా దీన్ని తాగడం వల్ల ప్రయోజనం లేకపోగా ఇతర సమస్యలు వస్తాయి. గొంతు, అన్నవాహికకు హానికరం. గొంతులో చికాకు పెడుతుంది. మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎప్పుడు నేరుగా తీసుకోకూడదు. ఆలివ్ ఆయిల్ లేదా నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also read: ఈ స్పెషల్ ఛాయ్ తాగారంటే తలనొప్పి చిటికెలో మటుమాయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget