అన్వేషించండి

Chest Pain : ఛాతీలో చీల్చేసినట్టు నొప్పి వస్తుందా? ఇది హార్ట్ ఎటాక్ కాదు.. కానీ చాలా ప్రమాదమంటోన్న వైద్యులు

Aortic Dissection : ఛాతీలో నొప్పి వస్తే గ్యాస్ నొప్పి అనుకుంటారు. నొప్పి ఎక్కువగా వస్తే అది కచ్చితంగా గుండెపోటు అనుకుంటారు. కానీ చీల్చేసే నొప్పి వస్తే మాత్రం అది హార్ట్ ఎటాక్ కాదంటున్నారు వైద్యులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గుండెపోటుగా పొరబడే అయోర్టిక్ డిసెక్షన్ ప్రాణాంతక అత్యవసర పరిస్థితి.
  • బృహద్ధమని పొరల చీలిక వలన అవయవాలకు రక్తప్రసరణ ఆగిపోవచ్చు.
  • తీవ్రమైన, అకస్మాత్తు నొప్పి, చేతులు బలహీనపడటం ప్రధాన లక్షణాలు.
  • దీర్ఘకాల అధిక రక్తపోటు దీనికి ముఖ్యమైన ప్రమాద కారకం.

Sudden Severe Chest Pain : ఛాతీలో నొప్పి వస్తే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్. అయితే ప్రతి ఛాతీ నొప్పికి కారణం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో బ్లాకేజీ మాత్రమే కాదు. కొన్నిసార్లు బృహద్ధమని(Aorta) గోడలో చీలిక ఏర్పడటం కూడా కారణం రావచ్చు. దీనినే అయోర్టిక్ డిసెక్షన్ (Aortic Dissection) అంటారు. ఇది చాలా అత్యవసర వైద్య పరిస్థితి అని వైద్యులు చెప్తున్నారు. వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

హైదరాబాద్‌ యశోదా హాస్పిటల్స్​కు చెందిన డైరెక్టర్ ఆఫ్ క్యాథ్ ల్యాబ్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పవన్ పొద్దార్ అయోర్టిక్ డిసెక్షన్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. దీనిగురించి కచ్చితంగా అవగాహన ఉండాలని తెలిపారు. డాక్టర్ పవన్ ప్రకారం.. హార్ట్ ఎటాక్‌లో నొప్పి కొంతసేపటికి పెరుగుతుండొచ్చు. కానీ ఏఓర్టిక్ డిసెక్షన్‌లో నొప్పి అకస్మాత్తుగా మొదలై.. కొన్ని సెకన్లలోనే తీవ్ర స్థాయికి చేరుకోవచ్చు. అందుకే ఈ నొప్పి స్వభావాన్ని తెలుసుకోవడం ముఖ్యమన్నారు.

Also Read : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?

ఏఓర్టిక్ డిసెక్షన్ అంటే..

ఏఓర్టా మన శరీరంలోని అతిపెద్ద ధమని. ఇది గుండె నుంచి శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని తీసుకెళ్తుంది. ఏఓర్టా గోడలో మూడు పొరలు ఉంటాయి. లోపలి పొరలో చీలిక ఏర్పడినప్పుడు.. ఆ చీలిక ద్వారా రక్తం గోడలోని పొరల మధ్యకు ప్రవేశిస్తుంది. దీంతో ఆ పొరలు ఒకదానికొకటి విడిపోతాయి. ఈ పరిస్థితినే ఏఓర్టిక్ డిసెక్షన్ అంటారు.

ఇలా జరిగితే శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. చీలిక మెదడు, మూత్రపిండాలు లేదా గుండెకు రక్తాన్ని అందించే ధమనుల వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. బలహీనపడిన ఏఓర్టా గోడ చిట్లిపోయి ఇంటర్నర్ల బ్లీడింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. చీలిక గుండెకు దగ్గరగా ఉన్న ఏఓర్టాలో ఏర్పడితే.. గుండె చుట్టూ రక్తం చేరి గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇది ప్రమాదమని డాక్టర్ పవన్ తెలిపారు. 

Also Read : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని అడుగులు వేయాలి? 6,000 లేదా 10,000? వైద్యుల సూచనలు ఇవే

అయోర్టిక్ డిసెక్షన్‌ ఎన్ని రకాలు?

ఏఓర్టిక్ డిసెక్షన్ రెండు రకాలు ఉంటంది. ఏఓర్టాలో చీలిక ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి దీనిని ప్రధానంగా టైప్-ఏ, టైప్-బీగా చెప్తారు. 

టైప్-ఏ అంటే..

గుండెకు దగ్గరగా ఉండే ఏఓర్టా పైభాగంలో.. అంటే అసెండింగ్ ఏఓర్టాలో చీలిక ఏర్పడితే దాన్ని టైప్-ఏ అంటారు. ఇది తీవ్రమైన అత్యవసర పరిస్థితి. గుండె లేదా ప్రధాన రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలాసార్లు ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది. 

Also Read :  బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?

టైప్-బీ

ఏఓర్టా దిగువ భాగమైన డిసెండింగ్ ఏఓర్టాలో చీలిక ఏర్పడితే దాన్ని టైప్-బీ అంటారు. కొన్ని సందర్భాల్లో మొదట రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తూ చికిత్స అందిస్తారు. అయితే సమస్యలు ఏర్పడితే స్టెంట్ లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

చీల్చినట్టు నొప్పి వస్తే జాగ్రత్త

అయోర్టిక్ డిసెక్షన్‌లో వచ్చే నొప్పికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండొచ్చు. అదేంటంటే అకస్మాత్తుగా నొప్పి మొదలవుతుంది. నొప్పి ఒక్కసారిగా తీవ్రంగా మారుతుంది. అలాగే నొప్పి వేరే ప్రాంతాలకు వ్యాపించవచ్చు. ఛాతీ నుంచి వెన్ను, భుజాల మధ్య భాగం లేదా పొత్తికడుపు వైపు నొప్పి వెళ్లొచ్చు. ఈ నొప్పి చీల్చినట్టు, చింపినట్టు లేదా కత్తితో పొడిచినట్టు అనిపించవచ్చని డాక్టర్ పవన్ తెలిపారు.

మరిన్ని లక్షణాలు

ఇదే కాకుండా స్పృహ కోల్పోవడం లేదా కళ్లు తిరిగి పడిపోవడం, చేతులు, కాళ్లలో బలహీనత లేదా తిమ్మిరి, మాట్లాడటంలో ఇబ్బంది, తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, చేతి లేదా కాలు చల్లగా, పాలిపోయినట్టు లేదా బలహీనంగా అనిపించడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం వంటివి జరుగుతాయి. 

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ ఇదే

దీర్ఘకాలంగా అధిక రక్తపోటు ఉండి.. అది సరిగ్గా నియంత్రణలో లేకపోతే ఏఓర్టా గోడపై ఒత్తిడి పెరిగి కాలక్రమేణా అది బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో ఏఓర్టిక్ డిసెక్షన్ ప్రమాదం పెరగవచ్చు. అలాగే స్మోకింగ్, ఏఓర్టిక్ అన్యూరిజం, వయసు పెరగడం, బైకస్పిడ్ ఏఓర్టిక్ వాల్వ్, వంశపారంపర్య వ్యాధులు, స్టిమ్యులెంట్ డ్రగ్స్ వినియోగం వంటివి ప్రమాదానికి దారితీస్తాయి. 

ఎలా గుర్తిస్తారంటే..

అయోర్టిక్ డిసెక్షన్‌ను గుర్తించడానికి కేవలం ఈసీజీ లేదా రక్త పరీక్షలు సరిపోవు. వైద్యులు పరిస్థితిని బట్టి సీటీ యాంజియోగ్రామ్ వంటి ప్రత్యేక ఇమేజింగ్ పరీక్షలు చేస్తారు. అందుకే నొప్పి ఎప్పుడు మొదలైంది.. ఎంత తీవ్రంగా ఉంది.. ఛాతీలో ఎక్కడ మొదలైంది.. వెన్ను లేదా పొత్తికడుపు వైపు వ్యాపిస్తుందా వంటి వివరాలను స్పష్టంగా చెప్పడం ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు. 

Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
HIV and Pregnancy : HIV ఉన్నా తల్లి కావచ్చు.. బిడ్డకు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి ప్రాసెస్ ఇదే
HIV ఉన్నా తల్లి కావచ్చు.. బిడ్డకు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి ప్రాసెస్ ఇదే
Aloe Vera Benefits : చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి
చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి
HIV Emergency Treatment : హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget