అన్వేషించండి

Tips to Manage Daily Stress : స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి

Stress Managing Tips : ఈ రోజుల్లో ఒత్తిడి చాలామందికి రోజువారీ సమస్యగా మారింది. కానీ అది జీవితాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మరి దీనిని ఎలా దూరం చేసుకోవాలో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మీకోసం కొంత సమయం కేటాయించి, మనసుకు విశ్రాంతినివ్వండి.
  • వ్యాయామం, యోగా, తగిన నిద్రతో ఒత్తిడిని నియంత్రించండి.
  • ఇతరులతో మాట్లాడి, చిన్న సంతోషాలతో మానసిక స్థితి మెరుగుపరచుకోండి.
  • ఒత్తిడి ఎక్కువైతే నిపుణులను సంప్రదించి, సానుకూల దృక్పథంతో ఉండండి.

Simple Ways to Reduce Daily Stress : ఒత్తిడికి చాలా కారణాలు ఉంటాయి. చాలామంది ఈ స్ట్రెస్ వల్ల మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని ఎఫెక్ట్ వల్ల సంతోషంగా ఉండాల్సిన మూమెంట్స్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఇలా తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే ఈ చిట్కాలను కచ్చితంగా ట్రై చేయండి. స్ట్రెస్​ని తగ్గించి సంతోషంగా ఉండేందుకు ఈ టిప్స్​ పక్కా హెల్ప్ చేస్తాయంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలు ఏంటో.. వాటివల్ల కలిగే లాభామేంటో చూసేద్దాం. 

మీ కోసం కొంత సమయం..

ప్రతిరోజూ మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి. పనిలో లేదా చదువులో తీరిక లేకుండా గడిపిన తర్వాత.. మీకోసం మీరు కాసేపు టైమ్ కేటాయించుకోవడం ముఖ్యం. ఈ సమయంలో మీకు నచ్చిన పనిని మీరు చేయవచ్చు. ఖాళీగా ఉండడం మొదలుకొని.. పుస్తకం చదవడం, సంగీతం వినడం, నడకకు వెళ్లడం లేదా స్నేహితునితో మాట్లాడటం వంటి.. మీ మనసును తేలికగా చేసే పనులు చేయవచ్చు. 
ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 నిమిషాలు దీనికోసం సమయం కేటాయించండి. ఈ సమయంలో మీ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మరీ మంచిది. ఇది మీ మనసుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడిని దూరం చేస్తుంది.

Also Read : యువకుల్లో ఒత్తిడి పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..

నిద్రే అసలైన మెడిసన్..

ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన శరీరం చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజూ కొద్దిసేపు నడవడం, తేలికపాటి వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం మంచిది. నిద్రవిషయంలో ఎలాంటి రాజీ పడొద్దు. ఇవన్నీ ఒత్తిడిని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్ చూస్తే.. ఆ అలవాట నిద్రపై ప్రభావం చూపిస్తుంది. 

ప్రతిరోజూ దాదాపు ఒకే సమయానికి పడుకోవడానికి, నిద్రలేవడానికి ప్రయత్నించండి. పడుకునే ముందు కాసేపు ఫోన్‌కు దూరంగా ఉండండి. మంచి నిద్ర మరుసటి రోజు మీ శరీరం, మనస్సు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

Also Read : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

ఒత్తిడిలో ఉంటే చేయాల్సిన పనులు..

ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మీరు బాగా నమ్మే వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నించండి. మీ ఆలోచనలను పంచుకోవడం మనసు తేలికగా మారవచ్చు. అలాగే జీవితంలో జరిగే చిన్న చిన్న ఆనందాలపై దృష్టి పెట్టడం కూడా పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది. మీకు ఇష్టమైన ఆహారం తినడం, కుటుంబంతో సమయం గడపడం, పెంపుడు జంతువుతో ఆడుకోవడం లేదా బయట కాసేపు నడవడం వంటివి కూడా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. 

ప్రెజర్ తీసుకోకండి..

ప్రతి దాని గురించి మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురిచేసుకోకండి. కొన్నిసార్లు మన తప్పుల గురించి లేదా మనం పూర్తి చేయలేని పనుల గురించి ఎక్కువగా ఆలోచించి.. మరింత స్ట్రైస్ తీసుకుంటాము. ఆ సమయంలో పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. అన్నీ ఒక్క రోజులో పూర్తి చేయలేమని అర్థం చేసుకోండి. మీ ప్రయారిటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రిమైజ్ కానివ్వకండి. ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టండి. మీరు ఏ పని చేసినా దానిపై మీ పూర్తి మనసు ఉంచండి. 

Also Read : కంగారు, ఒత్తిడి, కోపం.. వీటిని కంట్రోల్ చేయడానికి సుందర్ పిచాయ్ ఫాలో అయ్యే 3 గోల్డెన్ రూల్స్ ఇవే

ఏదైనా పని పూర్తి కాకపోతే.. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. తర్వాతి రోజుకు దానిని షెడ్యూల్ చేసి.. కంప్లీట్ చేసేందుకు ట్రై చేయండి. అవసరమైతే ఇతరుల హెల్ప్ తీసుకోండి. ఒత్తిడి ఎక్కువరోజులు కొనసాగినా.. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగినా.. మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడటం మంచిది.

పాజిటివ్​గా ఆలోచించండి..

వీలైనంత వరకు సానుకూల విషయాలపై దృష్టి పెట్టండి. సంతోషంగా ఉండాలంటే మీకు అనుకూలమైన పాజిటివ్ విషయాలు ఏంటో గుర్తించి.. వాటిపై మరింత ఫోకస్ చేయడం మంచిది. రాత్రి పడుకునేప్పుడు మీ లైఫ్​లో మీకున్న సక్సెస్​ పాయింట్స్, విజయాలు, బెస్ట్ మూమెంట్స్ గురించి ఆలోచించండి. అతిగా ఆలోచించకుండా.. సానుకూలమైన విషయాలనే గుర్తుచేసుకోండి. ఈ అలవాట్లు ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి, రోజువారీ జీవితాన్ని మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తాయి. 

Also Read : ఒత్తిడి తగ్గి పనితీరు పెరగాలా? సక్సెస్ కావాలంటే ఈ 5 మిలటరీ రూల్స్ ఫాలో అవ్వండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Dussehra Navratri Day 4 :దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Embed widget