అన్వేషించండి

Heart Attack vs Cardiac Arrest : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?

Heart Diseases : ఛాతిలో నొప్పి వస్తే చాలామంది దానిని గుండెపోటు అనుకుంటారు. కానీ అది హార్ట్ అటాక్ మాత్రమే కాదు కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్ కూడా కావచ్చు. మరి వాటి మధ్య తేడాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్ విభిన్న సమస్యలు.
  • రక్తనాళాల అడ్డంకితో గుండెకు రక్తం అందక గుండెపోటు వస్తుంది.
  • గుండె విద్యుత్ వ్యవస్థ అంతరాయంతో కార్డియాక్ అరెస్ట్ వస్తుంది.
  • అయోర్టా చీలిక తీవ్ర ఛాతీ, వీపు నొప్పి అయోర్టిక్ డిసెక్షన్.

Heart Attack and Cardiac Arrest and Aortic Dissection Differences : చాలామందికి గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్​ గురించి పెద్ద అవగాహన ఉండదు. అందుకే ఈ మూడు ఆరోగ్య సమస్యలను చాలామంది ఒకటే అనుకుంటారు. ఎందుకంటే వీటన్నింటిలోనూ గుండెకు సంబంధించిన సమస్యలు, అకస్మాత్తుగా కనిపించే లక్షణాలు కామన్​గా ఉంటాయి. అయితే ఈ మూడింటికీ కారణాలు, శరీరంలో జరిగే మార్పులు వేర్వేరుగా ఉంటాయని చెప్తున్నారు వైద్యులు. 

గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్ లక్షణాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని చెప్తున్నారు డాక్టర్ విక్రమ్ రెడ్డి. యశోద ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ విక్రమ్ రెడ్డి ఈ సమస్యల లక్షణాల గురించి.. ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి వంటి అంశాలు వివరించారు. 

Also Read : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని అడుగులు వేయాలి? 6,000 లేదా 10,000? వైద్యుల సూచనలు ఇవే

హార్ట్ అటాక్

హార్ట్ అటాక్‌ను వైద్యభాషలో మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ (Myocardial Infarction) అంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సాధారణంగా రక్తనాళం సన్నబడటం లేదా అందులోని కొవ్వు పొర పగిలి.. దానిపై రక్తం గడ్డకట్టడం వల్ల ఈ అడ్డంకి ఏర్పడుతుంది.

హార్ట్ అటాక్ సమయంలో కనిపించే లక్షణాలు..

గుండెపోటు వచ్చినప్పుడు ఛాతిలో ఒత్తిడి, బరువుగా అనిపిస్తుంది. లేదా నొప్పి ఎక్కువగా ఉంటుంది. చేయిలో నొప్పి మొదలై.. వీపు, మెడ లేదా దవడ వైపు వ్యాపించడం కూడా దీనిలో భాగమే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు పట్టడం, వికారం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ విక్రమ్ రెడ్డి తెలిపారు. 

Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?

కార్డియాక్ అరెస్ట్

కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) అనేది హార్ట్ అటాక్‌కు భిన్నమైన పరిస్థితి. ఈ సమయంలో గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపింగ్ చేయడం అకస్మాత్తుగా ఆగిపోతుంది. గుండె విద్యుత్ వ్యవస్థలో తీవ్రమైన అంతరాయం ఏర్పడటమే దీనికి కారణం. 

కార్డియాక్ అరెస్ట్‌లో కనిపించే ప్రధాన లక్షణాలు..

కార్డియాక్ అరెస్ట్ వస్తే బాధితుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు. స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకోకపోవడం లేదా గ్యాస్పింగ్‌లా శ్వాస తీసుకోవడం, పిలిచినా లేదా తాకినా స్పందించకపోవడం ప్రధాన లక్షణాలుగా చెప్తున్నారు. అయితే ఇది అత్యవసర ప్రాణాపాయ పరిస్థితి. కార్డియాక్ అరెస్ట్ అనుమానం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే CPR ప్రారంభించాలి. అందుబాటులో Automated External Defibrillator ఉంటే ఉపయోగించాలి డాక్టర్ విక్రమ్ రెడ్డి సూచించారు.

Also Read : రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా? గుండె, మెదడు, ఇమ్యూనిటీపై పడే ప్రభావాలు ఇవే

అయోర్టిక్ డిసెక్షన్ 

అయోర్టా అనేది గుండె నుంచి శరీరంలోని మిగతా భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళం. ఈ రక్తనాళం లోపలి పొరలో చీలిక ఏర్పడినప్పుడు అయోర్టిక్ డిసెక్షన్ (Aortic Dissection) వస్తుంది. ఈ చీలిక ద్వారా రక్తం రక్తనాళం గోడలోకి ప్రవేశించి.. దాని పొరలను విడదీస్తుంది.

అయోర్టిక్ డిసెక్షన్ లక్షణాలు..

ఈ సమస్య వస్తే అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతి లేదా పై వీపు నొప్పి వస్తుంది. నొప్పి వీపు లేదా పొట్ట వైపు కదులుతున్నట్లు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ తప్పడం, కొన్ని సందర్భాల్లో బలహీనత లేదా స్ట్రోక్‌ను పోలిన లక్షణాలు కనిపిస్తాయి.

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే.. 

లక్షణాల స్వభావాన్ని బట్టి కొన్ని సంకేతాలు కనిపించినా.. ఇంట్లోనే హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ లేదా అయోర్టిక్ డిసెక్షన్ అని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని డాక్టర్ విక్రమ్ రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షల ద్వారానే వీటిని నిర్ధారణ చేయగలమన్నారు. అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతి నొప్పి, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, మూర్ఛ లేదా స్ట్రోక్‌ను పోలిన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. 

Also Read : మధుమేహం, బీపీ, గుండె సమస్యలున్నవారికి 5 బెస్ట్ వ్యాయామాలు ఇవే.. నిపుణుల సూచనలతో

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Snake Gourd Dal : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget