అన్వేషించండి

Heart Health : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని అడుగులు వేయాలి? 6,000 లేదా 10,000? వైద్యుల సూచనలు ఇవే

Steps Count : ప్రతిరోజూ 6,000 నుంచి 8,000 అడుగులు నడవడం కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గించడానికి, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని దూరం చేయడానికి ఎన్ని అడుగులు వేయాలో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 10,000 అడుగుల లక్ష్యం జపాన్ కంపెనీ ప్రచారంతో వచ్చినది.
  • వైద్యులు 6,000-8,000 అడుగులు గుండెకు సరిపోతారని సూచిస్తున్నారు.
  • నడకతో రక్తప్రసరణ, బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి.
  • వేగం, నాణ్యత ముఖ్యం; వ్యాధులున్నవారు వైద్యుని సంప్రదించాలి.

10,000 Steps Every Day For Heart Health : మీరు ప్రతిరోజూ మీ స్మార్ట్‌వాచ్‌ను టైమ్ కోసం కాకుండా స్టెప్ కౌంట్ కోసం చూస్తున్నారా? మీ అడుగులు 10,000 కంటే తక్కువగా ఉంటే మీకు కాస్త నిరాశ కలగవచ్చు. ఎందుకంటే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 10,000 అడుగులు వేయడం చాలా అవసరమని.. లేకపోతే పడిన కష్టమంతా వృధా అవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజంగా అవసరమా? 10కె స్టెప్స్​పై వైద్యులు ఇస్తోన్న సూచనలు ఏంటో.. గుండె ఆరోగ్యం కోసం ఎంత నడవాలో ఇప్పుడు చూసేద్దాం. 

జపనీస్ కంపెనీ పబ్లిసిటీ

10,000 అడుగుల లక్ష్యం ఎప్పుడూ వైద్యపరమైన సిఫార్సుగా ప్రారంభం కాలేదు. 1960లో ఒక జపనీస్ కంపెనీ వారి మాన్పో-కే పెడోమీటర్ ప్రాచుర్యం పొందడంతో 10కె స్టెప్స్ ప్రాచుర్యం పెరిగింది. అప్పటి నుంచి ఇది ఏ శాస్త్రీయ పరిశోధనపైనా ఆధారపడనప్పటికీ.. ప్రజలు దీనిని ఆరోగ్యానికి నిజమైన కొలమానంగా పరిగణిస్తున్నారు. కానీ చాలామంది వృద్ధులకు రోజూ 6,000 నుంచి 8,000 అడుగులు సరిపోతాయని వైద్యులు చెప్తున్నారు. ఇది వారికి గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలదని చెబుతున్నారు. 

Also Read : బీపీని, బరువును కంట్రోల్ చేసే సిద్ధా, హీలింగ్ వాక్ టెక్నిక్స్.. స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట

గుండె ఆరోగ్యానికై నడక.. 

ప్రస్తుతం రోజూ 2,000 లేదా 3,000 అడుగులు మాత్రమే నడిచేవారు.. ఆ సంఖ్యను అకస్మాత్తుగా రెట్టింపు లేదా మూడు రెట్లు చేయాల్సిన అవసరం లేదు. క్రమంగా 6,000 అడుగులు నడవడం గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తనాళాలు సరిగ్గా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది, క్రమంగా రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మార్పులన్నీ కలిసి గుండెపై భారాన్ని తగ్గించి, గుండెపోటు, పక్షవాతం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

10కె స్టెప్స్ వేస్తే..

10,000 అడుగులు నడిస్తే పెద్దగా ఉపయోగం ఉండదా అంటే కాదు. యువకులు 8,000 నుంచి 10,000 అడుగులు నడవడం వల్ల రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను, బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడం వంటి అనేక అదనపు ప్రయోజనాలు అందుతాయి. అయితే అడుగుల సంఖ్యతో పాటు నడక వేగం, నాణ్యత కూడా అంతే ముఖ్యం. అంటే నెమ్మదిగా, చురుకుగా నడవడం వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయని గుర్తించుకోవాలి.

Also Read : భోజనం చేసిన తర్వాత ఎంత సేపు వాక్ చేయాలి.. నడిచేప్పుడు చేయకూడని తప్పులు, గుర్తించుకోవాల్సిన విషయాలివే

వైద్యుల సూచనలు..

డాక్టర్ గుప్తా ప్రకారం.. నడుస్తున్నప్పుడు మీ శ్వాస, హృదయ స్పందన రేటు కొద్దిగా పెరిగినా.. మీరు మాట్లాడగలిగితే అది అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి. చురుకుగా నడవడం ద్వారా వారానికి 150 నిమిషాల తేలికపాటి వ్యాయామాన్ని సులభంగా సాధించవచ్చు. అంతేకాకుండా వీటన్నింటికీ మీకు సమయం లేకపోతే.. మీ దైనందిన జీవితంలో చిన్న మార్పులు చేసుకోవాలంటున్నారు. 

ఉదాహరణకు ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కడం, వాహనాన్ని కొంచెం దూరంలో పార్క్ చేయడం, ఫోన్‌లో మాట్లాడుతూ నడవడం, లేదా భోజనం తర్వాత 10 నిమిషాల పాటు నడవడం వంటి మార్పులు చేసుకోవాలి. భోజనం తర్వాత నడవడం వల్ల శరీరంలో షుగర్​ను మెరుగ్గా వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ అవుతాయి.

ఇప్పటికే గుండె జబ్బులు ఉంటే..

గుండె జబ్బులు, హై బీపీ, లేదా కీళ్లవాతం వంటి ముందునుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. నడకను పెంచే ముందు వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సరిపోయే స్టెప్ కౌంట్ ఏదీ లేదని అంటున్నారు. 6,000 అడుగులు కూడా గుండెకు మంచివే. అలాగే 8,000 నుంచి 10,000 వేగవంతమైన అడుగులు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.

Also Read : ఉదయం నడిస్తే మంచిదా? సాయంత్రం నడక బెటరా? ఎప్పుడు వాక్ చేస్తే మంచిదో తెలుసా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget