అన్వేషించండి

Skin Care: హైలురోనిక్ యాసిడ్ అంటే ఏమిటీ? ఇది నిజంగానే ఏజ్ తగ్గిస్తుందా? లాభనష్టాలేమిటీ?

వృద్ధాప్య ఛాయలు తగ్గించి, ముడతలు లేని చర్మం పొందటం కోసం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఉత్పత్తి హైలురోనిక్ యాసిడ్.

ర్మాన్ని కాపాడుకుంటూ అందంగా ఉంచుకోడానికి మార్కెట్లో వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల వయస్సు దాచేసుకునే అవకాశం లభిస్తుంది. అటువంటి వాటిలో ఇప్పుడు ఎక్కువ ప్రజాదరణ పొందిన హైలురోనిక్ యాసిడ్. ఇదొక యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్. సెలబ్రిటీలు కూడా దీన్నే వాడుతున్నామంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. దీనికి ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. మరి ఈ ఉత్పత్తి నిజంగానే అందాన్ని పెంచి.. వయస్సును తగ్గిస్తుందా? లాభాలేంటి? నష్టాలేమిటీ?

హైలురోనిక్ యాసిడ్ అంటే ఏమిటీ?

హైలురోనిక్ యాసిడ్ అనేది గ్లైకోసమినోగ్లైకాన్. ఇదొక సహజ కార్బోహైడ్రేట్. చర్మ నిర్మాణాన్ని అందించి స్కిన్ మెరిసేలా హైడ్రేట్ గా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలని నిరోధించడంలో సహాయపడుతుంది. మొటిమలు, వాటి వల్ల కలిగే మచ్చలు, గాయాలు నయం చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది.

హైలురోనిక్ యాసిడ్ ఎందుకు అవసరం?

ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. అయితే చర్మంలో వయస్సు పెరుగుతున్న కొద్ది ఈ ఉత్పత్తి తగ్గిపోతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, నీరు తక్కువగా తాగడం, సాధారణ ఆహారపు అలవాట్లు వల్ల ఇది క్షీణించిపోవడం జరుగుతుంది. ఫలితంగా చర్మం నిస్తేజంగా ముడతలు కనిపిస్తాయి. దీన్ని పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సరైన సమతుల్య పోషకాహారం తీసుకోవడం.

హైలురోనిక్ యాసిడ్ వల్ల ప్రయోజనాలు

⦿ వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది

⦿ మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్ ఇస్తుంది

⦿ గాయాలను నయం చేస్తుంది

⦿ ముడతలు లేని చర్మం

⦿ ముఖానికి రంగు వచ్చేలా చేస్తుంది

⦿ హైలురోనిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఒక పరిశోధన వెల్లడించింది. కాలుష్యం, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

⦿ చర్మం తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. తేమ లేకపోవడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. దాన్ని తగ్గించేందుకు ఇది సహకరిస్తుంది.

⦿ కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి వెళ్లలేవు. కానీ ఇది త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. చికాకు కలిగించదు. అన్ని రకాల చర్మాల వారికి చక్కగా సరిపోతుంది.

⦿ ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటే అది ఏడాది పాటు ఉంటుంది. ఇది సహజంగా కరిగిపోతుంది. ఉదయం వేళ దీన్ని రాసుకుంటే మంచిదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.

హైలురోనిక్ యాసిడ్ వల్ల దుష్ప్రభావాలు

చర్మ నిపుణులు అభిప్రాయం ప్రకారం దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి కొన్ని సమస్యలు కలిగిస్తుంది. హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు ఈ దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

☀ నొప్పి

☀ ఎర్రగా మారడం

☀ దురద

☀ వాపు

☀ గాయాలు కావడం  

హైలురోనిక్ యాసిడ్ ద్రావణం కంటే ఇంజెక్షన్ గా తీసుకుంటేనే ఎక్కువ దుష్ప్రభావాలు సంభవిస్తాయి. చర్మ స్థితిని మార్చేందుకు ఇప్పుడు అనేక సీరమ్, క్రీమ్, మాయిశ్చరైజర్ లలో హైలురోనిక్ యాసిడ్ పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు. చర్మ సంరక్షణ కోసం సీరమ్, ఫేస్ క్రీమ్స్ ఉపయోగించే బదులు ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఇలా చేశారంటే మీ పాదాలు మృదువుగా మారిపోతాయ్, ఇన్ఫెక్షన్లు దరిచేరవు

టాప్ హెడ్ లైన్స్

Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget