Peanuts: మచ్చలు పోయి చర్మం నిగనిగలాడాలంటే వేరుశెనగ తినండి
ఎన్నో పోషకాలు కలిగిన వేరుశెనగ తినడం వల్ల ఆరోగ్యమే కాదు అందం కూడా ఇస్తుంది.
వేరుశెనగ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అద్భుతమైన పోషకాహార. అధిక ప్రోటీన్ ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు గొప్ప మూలం. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని దరిచేరకుండా చేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని మంటని తగ్గిస్తాయి. జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే వేరుశెనగ అందం కూడా ఇస్తుంది. అదెలాగా అంటారా?
యాంటీ ఏజింగ్: శనగలు తినడం వల్ల మీ వయస్సు కనిపించకుండా చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలు దూరం చేస్తుంది. ముడతలు, మచ్చలు రాకుండా పోరాడేందుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
మాయిశ్చరైజింగ్: వేరుశెనగలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సహకరిస్తాయి. చర్మం దాని సహజ తేమని నిలుపుకోవడానికి సహాయపడే కొవ్వు ఆమ్లాలు ఇందులో సమృద్ధహయిగా ఉంటాయి.
మొటిమలతో పోరాటం: ఈ మధ్య కాలంలో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా మొటిమల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అవి వారి అందాన్ని చెరిపేస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే వేరుశెనగ తినాల్సిందే. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడతాయి. వాపుని తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మాన్ని రక్షిస్తుంది: వేరుశెనగలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే UV కిరణాల నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది.
కొల్లాజెన్ ఇస్తుంది: చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ చాలా అవసరం. వేరుశెనగలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మం ప్రకాశవంతం: విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంతో పాటు పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది.
గాయాలు నయం చేస్తుంది: ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేందుకు సహకరిస్తాయి. చర్మం మీద ఉన్న గాయాలని నయం చేస్తుంది. మంటని తగ్గిస్తుంది.
డార్క్ సర్కిల్స్ తొలగిస్తుంది: వేరుశెనగలో అధిక స్థాయిలో విటమిన్ కె, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి చర్మం మీద మొటిమలు, ఇతర కారణాల వల్ల వచ్చే నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉండటం వల్ల ఫ్రీ రాడిక్సల్ వల్ల జరిగే నష్టంతో పోరాడుతుంది.
చర్మం మృదువుగా: వేరుశెనగ నుంచి వచ్చే నూనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇది కొద్దిగా చర్మానికి రాసుకుని మర్దన చేసుకోవడానికి సహజమైన మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చెక్క వంట సామాను జిడ్డు వదలడం లేదా? ఇలా తోమారంటే నూనె మరకలు మటుమాయం