Cleaning Tips: చెక్క వంట సామాను జిడ్డు వదలడం లేదా? ఇలా తోమారంటే నూనె మరకలు మటుమాయం
చెక్క వంట సామానుకి అంటుకున్న జిడ్డు అంత త్వరగా వదలదు. వాటికి అంటుకున్న నూనె పోవాలంటే ఈ చిట్కాలతో పాటించి శుభ్రం చేసి చూడండి.
మోడ్రన్ కిచెన్ లో ఇప్పుడు అందరూ చెక్క వంట సామాను ఉపయోగించుకునేందుకు ఎక్కువగా ఇష్టం చూపిస్తున్నారు. చూసేందుకు చక్కగా ఉన్నప్పటికీ అవి దుమ్ము, ధూళి, నూనెని గ్రహిస్తాయి. సాధారణ వంట పాత్రలు తోమినట్టు వాటిని క్లీన్ చేస్తే వాటి మీద ఉన్న నూనె పోకుండా జిడ్డుగా ఉండిపోతాయి. చెక్క వంట సామాగ్రి నూనె పీల్చుకోవడం వల్ల బ్యాక్టీరియా ఏర్పాటయి అనారోగ్యానికి అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే చెక్క సామాను శుభ్రం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని చెక్క వంట సామాను శుభ్రం చేసేందుకు ఈ చిట్కాలు పాటించారంటే వాటికున్న నూనె చిటికెలో వదిలించుకోవచ్చు.
కొద్దిగా ఉప్పు వేయాలి
వంట సామాను డిష్ లిక్విడ్ తో కడిగిన తర్వాత దాని మీద కొద్దిగా ఉప్పు వేసి నిమ్మకాయతో రుద్దాలి. బాగా రుద్దిన తర్వా చల్లటి నీటితో శుభ్రం చేసుకుని పొడిగా ఉండేలా చూసుకోవాలి.
నిమ్మరసం
చెక్క వంట సామానుని గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టాలి. అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అందులో పాత్రలు 15-20 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు.
బేకింగ్ సోడా
చెక్క వంట సామాను శుభ్రం చేసుకోవడానికి మరొక సులభమైన మార్గం బేకింగ్ సోడా. నూనె ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బేకింగ్ సోడాని చిలకరించి దానిపై నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత దాన్ని స్క్రబ్ చేయడానికి మంచి వస్త్రం తీసుకుని తుడవాలి. తర్వాత దాన్ని కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎక్కువ రోజులు వాటి నునుపుదనం పోకుండా ఉండాలంటే అందులో కొద్దిగా నూనె రాసి పెట్టుకోవాలి.
వెనిగర్ లో నానబెట్టాలి
నూనె మరకలు, వాసన వదిలించుకోవడానికి చెక్క సామాను వెనిగర్ లో నానబెట్టాలి. తెల్లటి వెనిగర్ ని కొద్దిగా నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీటితో కడిగి టవల్ తో తుడిచేస్తుంది.
శాండ్ పేపర్ ఉపయోగించాలి
రఫ్ గా ఉండే శాండ్ పేపర్ ని చెక్క వంట సామాను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది బ్యాక్టీరియాతో నిండిన పై పొరని తొలగించి వేస్తుంది. చెక్క పాత్రని మృదువుగా ఉంచుతుంది.
వెచ్చని నీటిలో నానబెట్టడం
గోరువెచ్చని నీటిలో దిశ వాషింగ్ లిక్విడ్ వేసి పాత్రలు నానబెట్టుకోవాలి. గోరువెచ్చని నీరు బ్యాక్టీరియాని చంపుతుంది. ఇది డిష్ వాష్ ద్రవం చెక్కకి ఉన్న వాసనలు తొలగిస్తుంది. నూనె మరకలు తొలగిస్తుంది.
ఇవే కాదు పాత్రలకు అంటుకున్న జిడ్డు వదిలించుకునేందుకు బియ్యం కడిగిన నీళ్ళు కూడా చక్కగా ఉపయోగపడతాయి. అందులో కొద్దిగా నిమ్మరసం వేసి నానబెట్టిన తర్వాత క్లీన్ చేసుకున్న తళతళామెరిసిపోతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: తలస్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? అలా చేస్తే జుట్టు రాలిపోతుంది