News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Almonds: బాదం పప్పులు పేగుల ఆరోగ్యానికి మంచివేనా? అధ్యయనంలో ఏం తేలింది?

బాదం పప్పులు పేగులకి మంచి చేస్తాయా? లేదా చెడు చేస్తాయా? అనే దాని గురించి ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. అందులో ఏం తేలింది, నిపుణులు అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

మధ్య కాలంలో ఎక్కువ మంది ఆరోగ్యం మీద శ్రద్ద బాగానే చూపిస్తున్నారు. తమ డైట్లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. వాటిలో ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ ఎక్కువగా నానబెట్టుకుని తింటున్నారు. బాదం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎందుకంటే వాటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పొట్టు ఒలచకుండా తింటే అది అరగదని పేగులకి చుట్టుకుపోతుందని కొందరు చెబుతారు. అందుకే తప్పనిసరిగా వాటిని నానబెట్టుకుని తొక్క తీసిన తర్వాతే తినేందుకు చూడాలని అంటారు. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది. ఇవి తినడం వల్ల పేగులకి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా అనే విషయం అందరికీ సందేహమే.

పేగులకి మంచివేనా? ఏం తేలింది?

రోజుకి కొన్ని బాదం పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి అన్నీ విధాలుగా ప్రయోజనమే చేకూరుతుందని పోషకాహార నిపుణులు చెప్పుకొచ్చారు. పేగుల్లో మైక్రోబయామ్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి పోషకాలను జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థలతో సహా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. బాదం తీసుకోవడం వల్ల పేగులని ఆరోగ్యంగా ఉంచుతుందా లేదా అనేది తెలుసుకునేందుకు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. అందులో 87 మంది ఆరోగ్యవంతమైన పెద్దలని తీసుకున్నారు. వాళ్ళు ఇప్పటికే సిఫార్సు చేయబడిన ఫైబర్ కంటే తక్కువ మొత్తం తింటున్నారు.

అధ్యయనంలో పాల్గొన్న వారిని మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ కి రోజుకి 56 గ్రాముల బాదం పప్పులు, మరొక గ్రూప్ కి రోజుకి 56 గ్రాముల గ్రౌండ్ బాదంపప్పు స్నాక్స్ గా ఇచ్చారు. మిగతా వారికి బాదం శక్తితో సమానమైన మఫిన్స్ ఇచ్చారు. ఇలా సుమారు నాలుగు వారాల పాటు అధ్యయనం చేశారు. మఫిన్ తినే వారితో పోలిస్తే బాదం తినే వారిలో బ్యూటిరెట్ గణనీయంగా ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.

బ్యూటిరేట్ అంటే ఏంటి?

ఇదొక చిన్న గొలుసు కొవ్వు ఆమ్లం. పెద్ద పేగు నుంచి కణాలకి ఇంధనం చేర్చే ప్రధాన వనరు. ఈ కణాలు సక్రమంగా పని చేసినప్పుడే పేగుల్లో మంచి సూక్ష్మ జీవులు వృద్ధి చెంది, పేగుల గోడలు బలంగా ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే పోషకాల్ని గ్రహించేందుకు అనువుగా మారుతుంది.

బాదంపప్పు తినే వారితో పోలిస్తే తినని వాళ్ళ ఆహారం పేగుల నుంచి కదలడానికి పట్టే సమయం ఎక్కువగా ఉంటుంది. అంటే బాదం తీసుకోవడం వల్ల ఆహార అరుగుదల శక్తి బాగుంటుందని నిరూపితమైంది. బాదంపప్పు మలబద్ధకం ఉన్నవారికి కూడా మేలు చేస్తుందని ఈ పరిశోధన సూచించింది. మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియంతో పాటు ఇతర ముఖ్య పోషకాలు ఎక్కువగా తీసుకోవడం, బాదం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలింది.

రోజుకి కనీసం 4 లేదా 5 బాదం వరకు తీసుకోవచ్చు. దీనిలో ఉన్న గుణాల వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రాకుండా నిరోధించడానికి ఉపయోగపడతాయి. పచ్చి బాదంతో పోలిస్తే నానబెట్టిన బాదం త్వరగా జీర్ణం అవుతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also read: ముడతలు లేని మృదువైన చర్మం కావాలా? అయితే నిద్రకు ముందు ఇలా చేయండి

 

Published at : 26 Oct 2022 02:48 PM (IST) Tags: Health Tips Dry fruits Almonds Gut health Healthy Food Almond Benefits

ఇవి కూడా చూడండి

Harmful Symptoms  : మీ శరీరంలో ఈ మార్పుల సంకేతం అదే.. అస్సలు అశ్రద్ధ చేయకండి

Harmful Symptoms : మీ శరీరంలో ఈ మార్పుల సంకేతం అదే.. అస్సలు అశ్రద్ధ చేయకండి

Winter food: చలికాలంలో తినకూడని కొన్ని ఆహారాలు ఇవిగో

Winter food: చలికాలంలో తినకూడని కొన్ని ఆహారాలు ఇవిగో

Hair Oil: తలకు నూనె రాసుకోకపోతే వెంట్రుకలకు నష్టమే

Hair Oil: తలకు నూనె రాసుకోకపోతే వెంట్రుకలకు నష్టమే

Papaya: బొప్పాయిని తిన్నాక ఈ ఆహారాలను తినకండి, మంచిది కాదు

Papaya: బొప్పాయిని తిన్నాక ఈ ఆహారాలను తినకండి, మంచిది కాదు

Eat Tomatoes Everyday : రోజూ టమోటాలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎవరు తినకూడదు?

Eat Tomatoes Everyday : రోజూ టమోటాలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎవరు తినకూడదు?

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !

Telangana Elections 2023 :  దేవుడి మీదే భారం  - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు  !

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం