Skin Care: ముడతలు లేని మృదువైన చర్మం కావాలా? అయితే నిద్రకు ముందు ఇలా చేయండి
పగలంతా బయట తిరిగి రావడం వల్ల కాలుష్యం కారణంగా చర్మం పొడి బారిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. దాని నుంచి బయటపడాలంటే రాత్రి వేళ పడుకునే ముందు ఈ టిప్స్ పాటించి చూడండి. మెరుగైన ఫలితాలు పొందుతారు.
ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి బిజీ బిజీ లైఫ్ లో నిమగ్నమైపోతారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకి పని ఒత్తిళ్లు, దుమ్ము, ధూళి. కాలుష్యం వల్ల మొహం కళ తప్పిపోతుంది. కాలుష్యం కారణంగా జిడ్డుగా మారిపోతుంది. అందుకే చర్మ సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖానికి క్లీనింగ్, హైడ్రేటింగ్ గా ఉంచుకోవాలి. లేదంటే మొటిమలు, పిగ్మెంటేషన్ బారిన పడే అవకాశం ఉంది. దాని నుంచి బయట పడాలంటే చర్మం శుభ్రం చేసుకోవడంతో పాటు ఎనిమిది గంటల నిద్ర కూడా అవసరం. అప్పుడే మొహం నిర్జీవంగా లేకుండా బాగుటుంది.
చర్మ సంరక్షణ కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. బయటకి వెళ్ళే ముందు ఏ విధంగా అయితే చర్మాన్ని కాపాడుకోవడం కోసం రక్షణ చర్యలు తీసుకుంటామో అలాగే రాత్రి నిద్రపోయే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మీ మొహం ఉత్తేజంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. మంచి చర్మ సంరక్షణ కోసం బ్యూటీషియన్స్ ఐదు దశల మార్గాన్ని సూచిస్తున్నారు. ఇది పాటిస్తే మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా తెల్లారే సరికి చక్కని ముఖం మీకు ఇస్తుంది.
పిగ్మెంటేషన్ ఎదుర్కోవాలి
స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారిపోవడం. బయట తిరిగినప్పుడు కొందరు కాసేపటికే నల్లగా కనిపించేస్తారు. నోరు లేదా నుదుటి చుట్టూ ఎక్కువగా పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. దీని నుంచి బయట పడటం మన చేతుల్లోనే ఉంది. క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్ విధానం ఫాలో అవడం వల్ల పిగ్మెంటేషన్ కి చెక్ పెట్టేయవచ్చు. చర్మం టోనర్ చేయడం వల్ల దాని రంగుని మారుస్తుంది.
పొడి చర్మం
ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడి బారిపోవడం. దీని వల్ల స్కిన్ గుచ్చుకుంటున్నట్టుగా లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. చలి కాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. అందుకు ఒకే ఒక పరిష్కారం తేమగా ఉండేలా జాగ్రత్త పాటించడమే. పొడి బారిన చర్మం దురద, పొట్టు రాలడం, ఎర్రగా మారిపోవడం వంటి సమస్యలు కలిగిస్తుంది. అందుకే తప్పకుండా రాత్రి పూట నిద్రపోయే ముందు మాయిశ్చరైజర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయాన్నే మృదువుగా, హైడ్రేట్ చర్మాన్ని పొందవచ్చు.
మృదువైన చర్మం
మృదువైన నున్నటి చర్మం కావాలంటే స్కిన్ ఎక్స్ ఫోలియేషన్, క్లెన్సింగ్ తప్పనిసరి. మెలటోనిన్ స్థాయి రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. అందుకే నిద్రకి ఉపక్రమించే ముందు చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. మెలటోనిన్ ఎక్కువగా ఉపతట్టి అవడం వల్లే చర్మం పిగ్మెంటేషన్ కి గురవుతుంది.
మెరిసే చర్మం కోసం
రాత్రి పూట దుమ్ము ఏమి పడదు కదా అని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకూడదు. నిద్రపోయే ముందు చర్మం తేమగా, శుభ్రంగా ఉండేలా చేయడం వల్ల చర్మ కణాలు శ్వాస తీసుకోవడానికి ఆటంకం లేకుండా చేస్తుంది. ఇది చర్మం ఆరోగ్యం మొత్తాన్ని నిర్ధారిస్తుంది. ఉదయం వేళ నిగనిగలాడే చర్మాన్ని మీకు అందిస్తుంది.
రాత్రిపూట చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల ముడతలు, వృద్ధాప్య సంకేతాలను దూరం చెయ్యొచ్చు. చర్మ కణాల్లో తేమ ఉండేలా చూసుకుంటే అందం మీకు మాత్రమే సొంతం అవ్వడం ఖాయం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చేతి వేళ్ళల్లో తిమ్మిర్లు? పరాస్థీషియా సమస్య ఏమో పరీక్షించుకోండి, లేకపోతే ఒళ్లంతా పాకేస్తుంది