Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి
పిల్లలకు తరచూ ఈ పండ్లు తినిపించడం వల్ల వారి జ్ఞాపకశక్తిని పెంచవచ్చు.
కొంతమంది పిల్లలకు ఎంత చదివినా గుర్తు ఉండదు. దీంతో తల్లిదండ్రులు వారిని కొడుతూ ఉంటారు. వారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉందంటే అందుకు మీరు చేయాల్సింది వాళ్ళని దండించడం కాదు. మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి పెరిగే విధంగా చేసే మంచి పోషకమైన ఆహారం ఇవ్వాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న అనేక పండ్లు వారికి ఇవ్వడం వల్ల మెదడు అభివృద్ధి చెందుతుంది. అవేంటంటే..
బ్లూ బెర్రీస్
బ్లూ బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెరుగైన జ్ఞాపకశక్తిని ప్రోత్సహిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి వాపుని తగ్గిస్తాయి. మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. స్కూలుకెళ్లే పిల్లలకు రోజు ఐదు నుంచి ఆరు బ్లూ బెర్రీ పండ్లను తినిపించండి. వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
దానిమ్మ
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ రసం జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరుని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కివీ
విటమిన్ సి, కె కి గొప్ప మూలం కివీ. ఇవి రెండు మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. మెదడు చురుకుగా ఉండేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
చెర్రీస్
చెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మెదడు కణాలు రక్షించడంలో సహాయపడతాయి. తక్కువ గ్లైసెమిక్ సూచీకను కలిగి ఉన్నాయి. మధుమేహులు కూడా తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరీకరించడంలో సహాయపడతాయి.
స్ట్రాబెర్రీ
విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులో ఆంథోసైనిన్లు కూడా ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
బ్లాక్ బెర్రీస్
బ్లూ బెర్రీస్ మాదిరిగా బ్లాక్ బెర్రీస్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. మెదడులో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మెదడు ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్లు, ఖనిజాలు అందిస్తుంది.
నారింజ
విటమిన్ సి గొప్ప మూలం. మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనది. అభిజ్ఞా పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అవకాడో
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యంగా మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉన్నాయి. మెదడు అభివృద్ధికి దోహదపడతాయి. ఇందులోని విటమిన్ కె, ఫోలేట్ అభిజ్ఞా పనితీరు పెంచుతాయి.
అరటి పండ్లు
పొటాషియంకి గొప్ప మూలం. మెదడు పనితీరు బాగుండెలా చేస్తుంది. మానసికంగా చురుకుగా ఉండేలా సహాయపడే అల్పాహారంగా ఉపయోగపడుతుంది.
యాపిల్స్
యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, డైటర్ ఫైబర్ ఉన్నాయి. ఇవి మొత్తం మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తినడం వల్ల అల్జీమర్స్, పక్షవాతం వంటివి వచ్చే అవకాశం తక్కువ. ఇవి జ్ఞాపకశక్తిని పెంపొందించి ఏకాగ్రతను ఇస్తాయి. వారంలో కనీస రెండు నుంచి మూడుసార్లు చేపలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటివి కూడా పిల్లలకి రోజూ తినిపిస్తూ ఉండాలి. వీటిలో కూడా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మానసిక స్థితిని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నెలరోజుల పాటు బంగాళాదుంప తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?