X

Abir India Awards: 10 మంది కళాకారులకు అబిర్ ఇండియా అవార్డులు... ఎక్సలెన్స్, ఐడియాస్, ఎక్స్‌ప్రెషన్స్ విభాగాల్లో ఆర్ట్ ఫెస్టివల్

అబిర్ ఇండియా నిర్వహించిన ఆర్ట్ ఫెస్టివల్ ముగిసింది. దేశంలో వచ్చిన కళాకృతుల్లో పది ఉత్తమ కళాఖండాలను నిర్వహకులు ఎంపిక చేశారు. సామాజిక, సమకాళినా అంశాలపై చిత్రకారులు కళాకృతులు ప్రదర్శించారు.

FOLLOW US: 

అహ్మదాబాద్‌కు చెందిన ఓ స్వచ్చంద సంస్థ అబిర్ ఇండియా నిర్వహించిన ఆర్ట్ ఫెస్టివల్ ఫస్ట్ టేక్ ఐదో ఎడిషన్‌ ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 122 సమర్పణలలో 10 మంది కళాకారులను  ఎంపికచేశారు. వీరికి ట్రోఫీతో పాటు రూ. 50,000 నగదు బహుమతి అందించనున్నారు. ఈ పది కళాఖండాలను శ్రేష్ఠత, ఆలోచనలు, వ్యక్తీకరణల ఆధారంగా ఎంపిక చేశారు. ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో మిక్స్డ్ మీడియా, లినోకట్‌లు, శిల్పాలు, యాక్రిలిక్ మొదలైన వాటితో సహా వివిధ రూపాల్లో రూపొందించిన కళాకృతులను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం యువ కళాకారులను ప్రోత్సహించడమని అబిర్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

Also Read:  భలే ఆఫర్.. ఆ ఇళ్లల్లో ఒంటరిగా ఉంటే నిమిషానికి రూ.12 చెల్లిస్తారట, కానీ.. అంత ఈజీ కాదు

ఈ ఫెస్టివల్ లో పాల్గొన్న కళాకారులు తమ కళలు వివిధ రంగాలతో విభిన్న మార్గాల్లో ఎలా ముడిపడి ఉన్నాయో వివరించారు. 'నేను నా కళాకృతులు వివిధ సామాజిక-ఆర్థిక సమస్యలపై గీశాను. నేను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించేటప్పుడు వివిధ తరగతుల వ్యక్తులను అధ్యయనం చేసి, నా కళాకృతుల ద్వారా వాటిని దృశ్య రూపంలో వివరించడానికి ప్రయత్నిస్తాను” అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆసిఫ్ ఇమ్రాన్ అన్నారు. మరో కళాకారిణి కిన్నారి తొండెల్కర్ తన కళాకృతులలో పరిసరాల గురించి తెలిపారు. పర్యావరణం, గత జ్ఞాపకాలను అన్వేషించేలా చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఎచింగ్, వుడ్‌కట్, సెరిగ్రఫీ ద్వారా తన ఆలోచనలకు పునఃసృష్టిచేస్తానన్నారు. 

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

ఈ ఫెస్టివల్ లో వచ్చిన నగదును కొంతమంది కళాకారులు భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే, మరికొందరు ఆ నగదు కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లకు ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు. 'నేను ఎచింగ్ ప్రెస్‌లో పెట్టుబడి పెడతాను. లాక్‌డౌన్ వల్ల వచ్చినా నా పనిని కొనసాగించడానికి నాకు మార్గాలు ఉన్నాయి" అని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చెరింగ్ నేగి చెప్పారు. తంగ్కా కళతో ప్రభావితమైందని నేగి తెలిపారు. రచనలలో మేఘాలను సూచించే విధానంగా బౌద్ధ అంశాలు ప్రస్తావిస్తానన్నారు.  ఈ కార్యక్రమం నిర్వాహకుల జ్యూరీలో KS రాధాకృష్ణన్, RM పళనియప్పన్, వాసుదేవన్ అక్కితం, క్రిస్టీన్ మైఖేల్, హార్ట్‌మట్ వర్స్టర్ ఉన్నారు.

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: art Art Festival Abir India First Take

సంబంధిత కథనాలు

Corona virus: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే

Corona virus: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే

Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్

Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్

Compostable Plates: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు

Compostable Plates: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు

Pressure Cooker: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

Pressure Cooker: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

Covaxin: ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌పై ప్రభావవంతంగా పనిచేసేది కోవాక్సినే... చెబుతున్న ఐసీఎమ్ఆర్ అధికారులు

Covaxin: ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌పై ప్రభావవంతంగా పనిచేసేది కోవాక్సినే... చెబుతున్న ఐసీఎమ్ఆర్ అధికారులు

టాప్ స్టోరీస్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు