News
News
X

Viral: గర్భంలో తొమ్మిదేళ్లుగా పిండాన్ని మోస్తున్న మహిళ, చివరికి ఏమైందంటే

ఓ మహిళ తనకు తెలియకుండానే తొమ్మిదేళ్లుగా తన గర్భంలో ఓ పిండాన్ని మోస్తూ వచ్చింది.

FOLLOW US: 
Share:

లిథోపెడియన్... ఇదొక అరుదైన ఆరోగ్య సమస్య. వైద్యులు చెబుతున్న ప్రకారం ఈ సమస్యలో తల్లి గర్భంలో ఉన్న పిండం రాయిలా గట్టి పడిపోతుంది. అది చుట్టూ ఉన్న పేగులను తన విధులను నిర్వహించకుండా అడ్డుకుంటుంది. తద్వారా శరీరం ముఖ్యమైన పోషకాలను గ్రహించలేక, పోషకాహార లోపం బారిన పడుతుంది. ఈ పరిస్థితి తీవ్రంగా మారి మరణం సంభవిస్తుంది. అమెరికాలోని ఓ మహిళ ఈ ఆరోగ్య సమస్య బారినే పడింది. అమెరికాకు శరణార్ధిగా వచ్చింది కాంగో దేశానికి చెందిన ఓ మహిళ. ఆమె తొమ్మిది ఏళ్ల క్రితం గర్భాన్ని పోగొట్టుకుంది, కానీ గర్భసంచిని శుభ్రం చేయించలేదు. దీంతో పిండం లోపలే ఉండిపోయి, గట్టిగా కాల్సిఫైడ్ పిండంగా మారిపోయింది. అలా తొమ్మిదేళ్లపాటు ఆ రాతి పిండాన్ని మోస్తూనే తిరిగింది ఆ మహిళ. దీంతో ఆమె పేగులు మూసుకుపోయి, తీవ్రమైన పోషకాహార లోపం వచ్చింది. కడుపునొప్పి, అజీర్ణం బారిన పడింది. మహిళ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు స్కానింగ్ చేశారు. లోపల ఉన్న రాతిపిండాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆహారం తింటే కడుపునొప్పి అధికంగా రావడంతో ఆమె తినడం కూడా మానేసింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరింది. ఇన్నాళ్లు ఆమె తన పొట్టలో పిండం ఉన్న సంగతి తెలిసి కూడా ఎందుకు క్లీన్ చేయించుకోలేదని వైద్యులు ప్రశ్నించారు. దానికి ఆమె తాను డ్రగ్స్ తీసుకోవడం వల్లే బిడ్డ చనిపోయిందని తనపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమో అని భయపడి చికిత్సకు నిరాకరించినట్టు ఆమె చెప్పింది. 

లిథోపెడియన్ అంటే ఏమిటి?
అన్నల్స్ ఆఫ్ సౌదీ మెడిసిన్ ప్రకారం లిథోపెడియన్ అనే పదం గ్రీకు పదం అయినా లిథోస్ అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం రాయి . పెడియన్ అంటే బిడ్డ అని అర్థం. లిథోపెడియన్ అనేది రాయిలా గట్టిపడిన పిండాన్ని సూచిస్తుంది. ఇవి పొత్తికడుపు దగ్గర స్కానింగ్ చేయడం వల్ల మాత్రమే బయటపడతాయి. శస్త్ర చికిత్స ద్వారా వీటిని బయటకు తీయాలి. చాలా దేశాల్లో ఇలాంటి లిథోపెడియన్ కేసులు బయటపడుతున్నాయి.

1966 నుండి ఇప్పటివరకు 16 కేసులను గుర్తించారు వైద్యులు. వీరిలో ఐదుగురు 65 ఏళ్ల పైబడిన వారు, వీరిలో చాలామంది ఒకటిన్నర సంవత్సరం నుండి 35 ఏళ్ల వరకు రాతిపిండాన్ని మోసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  గర్భస్రావం అయ్యాక గర్భసంచిని క్లీన్ చేయించుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది లేదా ఇలా పిండం రాయిలా మారే ప్రమాదం కూడా ఉంది. 

Also read: డబ్బుతో ఆనందాన్ని కొనలేం అన్నది పచ్చి అబద్ధం అంటున్న అధ్యయనం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 14 Mar 2023 11:25 AM (IST) Tags: Viral News Fetus Rock Fetus

సంబంధిత కథనాలు

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

టాప్ స్టోరీస్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు