No more Pandemics: కరోనాలాంటి మహమ్మారులు మళ్లీ రాకుండా ఉండాలంటే చెట్లు పెంచాల్సిందే, చెబుతున్న కొత్త అధ్యయనం
కరోనా మహమ్మారితో ఇంకా వేగుతూనే ఉన్నాం, ఇలాంటి మహమ్మారి మరొకటి వస్తే తట్టుకోగలమా?
వాతావరణంలోని మార్పులు మన ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. లక్షాలాది ఎకరాల్లో అడవులు నాశనం చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. మహమ్మారుల పుట్టుకకు, నివారణకు కూడా పర్యావరణం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. అందుకే మనపై కరోనాలాంటి మహమ్మారులు దాడి చేయకుండా కాపాడుకోవాలంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలని, ముఖ్యంగా చెట్లు అధికంగా పెంచాలని, అడవుల విస్త్రీర్ణాన్ని పెంచాలని సూచిస్తోంది ఒక తాజా అధ్యయనం.
ప్రపంచవ్యాప్తంగా 20 మంది ఆరోగ్య నిపుణులు పర్యావరణ మార్పులతో ముడిపడిన రోగాలపై అధ్యయనం నిర్వహించారు. అందులో మానవజాతిపై మరో మహమ్మారి దాడి చేయకుండా ఉండాలంటే అడవుల విస్తీర్ణం పెంచాలని, వన్యప్రాణుల వ్యాపారం తగ్గించాలని ఆ అధ్యయన నివేదికలో తెలిపారు. జూనోటిక్ వ్యాధికారక క్రిములు మనుషులపై ప్రభావం చూపించకుండా అడ్డుకోవాలని, దీన్నే‘ప్రాథమిక మహమ్మరి నివారణ’గా పేర్కొన్నారు.
అడవుల విస్తీర్ణం తగ్గించడం వల్ల వన్య ప్రాణులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నట్టే, వన్య ప్రాణుల సంఖ్య తగ్గడం, వాటిని వేటాడి తినడం వల్ల, ఆ అడవి జంతువులపై దాడి చేసే జూనోటిక్ వ్యాధికారక క్రిములు మనుషులపై ప్రభావం చూపిస్తున్నాయి. కరోనా కూడా ఒక జీవి నుంచి మనుషులకు సోకిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి అడవిని పెంచుతూ, వన్యప్రాణుల సంఖ్యను తగ్గించుకుండా చూసుకుంటే మహమ్మారులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడ్డారు.
ఏ సమస్యకు అయినా ‘ప్రాథమిక నివారణ’ చాలా ముఖ్యమని వారు తెలిపారు. అంటువ్యాధులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకుంటే ప్రాణాలు అంటురోగాలు కూడా తగ్గుతాయని తెలిపారు.
అడవులు విపరీతంగా నరికివేయడం వల్ల పర్యావరణంలో ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. ఇది కూడా మనకు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భూమ్మీద పెరిగే మొక్కలు, జీవుల్లో 70శాతం అడవుల్లోనే ఉంటున్నాయి. అవన్నీ నివాసం కోల్పతాయి. వన్యప్రాణులు జనావాసాల్లోకి ప్రవేశిస్తాయి. వాటితో పాటూ కొన్ని కొత్త రోగాలు కూడా వస్తాయి. అడవులు తగ్గిపోతే ఆ ప్రభావం మనిషి జీవనం మీదే అధికంగా పడుతుంది. కాబట్టి అడవులను కాపాడుకుంటూ, ఇంటి చుట్టూ కూడా వీలైనంత మేరకు మొక్కలు, చెట్లు పెంచాలి. మానవాళి ఆరోగ్యానికి చెట్లు అత్యవసరం.
Also read: యూరిన్ ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా, అది ఎంత ప్రమాదమో తెలుసా?
Also read: గుండె నీరసపడుతోంది, ఉక్కులా మారాలంటే ఈ ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సిందే