అన్వేషించండి

Fairness Creams Leading to Kidney Issues : అమ్మాయిలు ఫెయిర్​నెస్ క్రీములు వాడుతున్నారా? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త

Skin Fairness Creams are Increasing Kidney Problems : అందం కోసం ఫెయిర్​నెస్​ క్రీమ్​లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అవే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి అంటోంది తాజా అధ్యయనం.

Cancer with Fairness Creams : మెరిసే చర్మం, ఫెయిర్​గా కనిపించేందుకు చాలామంది స్కిన్ ఫెయిర్​నెస్ క్రీమ్​లు ఉపయోగిస్తారు. ఇవి రాసుకుంటే తెల్లగా కనిపిస్తారంటూ.. మీ స్కిన్ బ్రైట్​గా అవుతుందంటూ.. హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుందంటూ కంపెనీలు కూడా ఫెయిర్​నెస్ క్రీమ్​లను ప్రమోట్ చేస్తున్నాయి. అయితే వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి చూస్తున్నారు తప్పా.. స్కిన్​కు హానీ చేయని కెమికల్స్​ ఉపయోగించకూడదనే విషయాలు మరిచిపోతున్నారు. ఈ విషయాన్నే తాజా అధ్యయనం తెలిపింది. ఫెయిర్​నెస్ క్రీములతో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది. 

కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తుందట..

స్కిన్​ ఫెయిర్​నెస్ క్రీమ్​ల వాడకం వల్ల ఇండియాలో కిడ్నీ సమస్యల కేసులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ క్రీమ్​లలో అధిక మొత్తంలో పాదరసం ఉంటుందని.. అది మూత్రపిండాలకు హాని కలిగిస్తుందని చెప్తున్నారు. కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్​లో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. అధిక మెర్క్యూరీ కంటెంట్ ఉన్న ఫెయిర్​నెస్​ క్రీములను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెంబ్రానస్ నెఫ్రోపతీ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఈ సమస్య కిడ్నీ ఫిల్టర్​లను దెబ్బతీస్తుందని తెలిపింది. 

చర్మం ద్వారా పాదరసం లోపలికి పోతుంది..

మెంబ్రానస్ నెఫ్రోపతీ MN అనేది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది ప్రోటీన్​ లీకేజికి కారణమవుతుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడి మూత్రపిండ సమస్యలకు దారి తీస్తుంది. దీనివల్ల శరీరం నుంచి మూత్రం రూపంలో ప్రోటీన్​ను విసర్జించేలా చేస్తుంది. మాయిశ్చరైజర్​లోని పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్లిపోతుంది. ఇది మూత్రపిండాల ఫిల్టర్​లను నాశనం చేస్తుంది. ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్​ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని స్టడీలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు. 

ఉపయోగించి మానేస్తే.. చర్మం రంగు మారిపోతుందట..

ఇండియాలో లభించే బ్యూటీ ఫెయిర్​నెస్​ క్రీమ్​లు త్వరిత ఫలితాలను ఇస్తాయి. వాటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే వాటి ఫలితాలు బాగున్నాయనే ఉద్దేశంతో చాలామంది వాటిని రెగ్యూలర్​గా ఉపయోగిస్తూ ఉంటారు. పైగా ఒకసారి క్రీమ్​ను ఉపయోగించి వాటిని ఆపేస్తే చర్మం మరింత ముదురు రంగులోకి మారుతుంది. అందుకే వీటిని వాడడం ఆపరు. వాటివల్ల వినియోగం పెరిగి.. అది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జూలై 2021 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య మెంబ్రానస్ నెఫ్రోపతి కేసులను అధ్యయనం చేసి ఈ ఫలితాలు వెల్లడించారు. 

లక్షణాలు ఎలా ఉంటాయంటే.. 

మేకప్ వల్ల కిడ్నీ సమస్యలు వస్తే.. అలసట, నురుగతో కూడిన మూత్రం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రంలో ప్రోటీన్​ స్థాయిలు పెరుగుతాయి. రోగి మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్​ వెయిన్​ థ్రాంబోసిస్​ను అభివృద్ధి చేస్తుంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భరాల్లో ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకే ఫెయిర్​నెస్​ క్రీముల వాడకాన్ని నిలిపివేయాలని సూచిస్తున్నారు నిపుణులు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే ఈ ఫెయిర్​నెస్​ క్రీముల వినియోగాన్ని తగ్గించాలి అంటున్నారు. 

Also Read : టైప్​ 2 డయాబెటిస్​ను దూరం చేసే ఫుడ్ ఇదే.. రెగ్యూలర్​గా తీసుకుంటే చాలా మంచిదంటున్న తాజా అధ్యయనం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget