అన్వేషించండి

Foods for Type 2 Diabetes : టైప్​ 2 డయాబెటిస్​ను దూరం చేసే ఫుడ్ ఇదే.. రెగ్యూలర్​గా తీసుకుంటే చాలా మంచిదంటున్న తాజా అధ్యయనం

Yogurt Lowers Diabetes : డయాబెటిస్​ను కంట్రోల్ చేయడానికి, ప్రమాదాన్ని తగ్గించడానికి తమ డైట్​లో యోగర్ట్​ను చేర్చుకోమంటున్నారు వైద్యులు. ఎందుకంటే..

Foods to Control Type 2 Diabetes : డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో, ఇన్సులిన్​ను నిరోధించడంలో యోగర్ట్ మంచి ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. పెరుగు లేదా యోగర్ట్ రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా దీనిని రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను కూడా తగ్గుతుందని స్టడీ తెలిపింది. 

టైప్ 2 డయాబెటిస్​ని దూరం చేస్తుంది..

పెరుగు లేదా యోగర్ట్ మధుమేహం ప్రమాదాన్ని అరికడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. అయితే తాజా అధ్యయనం టైప్ 2 డయాబెటిస్​ను దూరం చేస్తుందని తెలిపింది. మార్చిలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని అధికారికంగా తేల్చింది. దానికి తగిన శాస్త్రీయ సాక్ష్యాధారాల ఆధారాలను కూడా చూపించింది. వారానికి కనీసం మూడుసార్లు పెరుగు తీసుకుంటే.. టైప్ 2 డయాబెటిస్​ తగ్గిస్తుందని, దూరం చేస్తుందని వారు తేల్చారు. దీనికి సంబంధించిన విషయాలను జర్నల్​లో ప్రచురించారు. 

రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది..

పెరుగులోని ప్రోబయోటిక్ కంటెంట్ రక్తంలో చక్కెరను తగ్గించి.. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర నిర్వహణకు అవసరమైన గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీని కంట్రోల్ చేస్తుంది. దీనికి గట్ మైక్రోబయోమ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. మధుమేహం ఉన్నవారిపై, డయాబెటిస్ ప్రమాదం పొంచి ఉన్నవారిపై ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే అన్ని యోగర్ట్స్ ఒకేలా ఉండవు. కాబట్టి ఎలాంటి ఫ్లేవర్స్​ లేని యోగర్ట్ తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. 

ఫ్లేవర్లు ఉంటే.. షుగర్ ఉంటుంది..

ఎందుకంటే ఫ్లేవర్​లు ఉన్నవాటిలో ప్రోబయోటిక్స్ ఉండకపోవచ్చు. పైగా వాటిలో షుగర్స్​ని కలుపుతారు. కాబట్టి మీరు ఫ్లేవర్స్​లేని యోగర్ట్ లేదా పెరుగును ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అదనపు చక్కెరలను నివారించవచ్చు. ఇవే కాకుండా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్​లతో కూడిన సమతుల్య ఆహారం రెగ్యూలర్​గా తీసుకోవాలి. రెగ్యూలర్ వ్యాయామం మధుమేహ ప్రమాదాన్ని దూరం చేస్తుందని డైటీషియన్లు చెప్తున్నారు.

అధిక స్థాయిలో పోషకవిలువలు.. 

పెరుగు లేదా యోగర్ట్​కి కేవలం షుగర్​ని కంట్రోల్ చేయడమే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో పోషక విలువలు అధిక స్థాయిలో ఉంటాయి. దానిలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ కేసీ, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్, బిఫిడోబాక్టీరియం జాతులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఊబకాయాన్ని తగ్గించి.. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెప్తున్నారు. స్థూలకాయ సమస్యలున్నవారికి యోగర్ట్ మంచి ప్రయోజనాలు అందిస్తుందని తెలిపారు. జుట్టు, చర్మ సమస్యలను దూరం చేయడంలో కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు. 

Also Read : యువతను టార్గెట్ చేస్తున్న స్ట్రోక్.. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారట.. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget