Sweetener Side Effects : కేకులు, కూల్ డ్రింక్స్, గమ్‌లతో జాగ్రత్త.. వాటిలోని స్వీటెనర్ ప్రాణాలకే ప్రమాదమంటున్న కొత్త అధ్యయనం
Neotame Sweetener Effects on Gut : చాలామంది కేకులు, స్వీట్ డ్రింక్ ఎక్కువగా తీసుకుంటారు. మీరు కూడా అలానే తింటారా? అయితే జాగ్రత్త.. ఇవి మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయట.
Neotame Sweetener Side Effects : చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా స్వీటెనర్లు గురించి చెప్తారు. మధుమేహులు, డైట్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవారు కేకులు, డ్రింక్స్, గమ్స్లలో చక్కెరకు బదులుగా స్వీటెనర్స్ ఉన్నవి ఉపయోగిస్తారు. అయితే ఇవి గట్ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపింది తాజా అధ్యయనం. స్వీటెనర్‌లో ఉండే నియోటేమ్ జీర్ణక్రియను దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ఈ స్వీటెనర్ ఆరోగ్యంపై విషప్రభావాన్ని చూపిస్తుందని.. పేగు బ్యాక్టీరియాను దెబ్బతీసి.. వాటిని బలహీనపరుస్తుందని తెలిపింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుందని వెల్లడించింది.
చక్కెర కన్నా డేంజర్ అవ్వొచ్చు..
అధిక బరువు, స్థూలకాయాన్ని నివారిస్తుందంటూ.. స్వీటెనర్‌గా నియోటేమ్ వంటి వాటిని తీసుకుంటారు. ఇప్పుడు చక్కెరే కాదు.. ఈ తరహా స్వీటెనర్లను కూడా తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, సెప్సిస్ వంటి ఇబ్బందికర లక్షణాలు కలగవచ్చని చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్‌తో బ్రిటన్‌లో ఏడాదితి నలభై వేల మంది చనిపోతున్నారని తేలింది. ఆహారం రుచిగా ఉండాలని, స్వీట్‌గా ఉండాలని రకరకాల స్వీటెనర్లను ఉపయోగిస్తున్నారని.. అవి ఆరోగ్యంపై విషపూరిత ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు.
శరీరంపై విషప్రభావం..
స్వీటెనర్లోని నియోటామ్ను షుగర్‌కి ప్రత్యామ్నాయంగా 2002లో అభివృద్ధి చేశారు. యూకేలలో విక్రయించే పానీయాలు, ఆహార పదార్థాలలో దీనిని విరివిగా ఉపయోగించారు. ఉత్పత్తుల లేబుల్స్‌పై కనిపించే పదార్థాల జాబితాలో ఈ స్వీటెనర్‌ను E961గా సూచిస్తున్నారు. ఇది శరీరంపై విషప్రభావాలు చూపిస్తుందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆంగ్లియా రస్కిన్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్లు, బంగ్లాదేశ్‌లోని జహంగీర్‌నగర్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్లు ఈ స్వీటెనర్పై అధ్యయనం చేశారు. దీనిలో భాగంగానే నియోటేమ్.. గట్‌లోని మంచి బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని గుర్తించారు. ఇది పూర్తిగా గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు.
గట్ మీదనే కాదు.. గుండెపై కూడా..
ఈ అధ్యయనంకి సంబంధించిన పరిశోధనలను ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. గతంలోని పరిశోధనల్లో స్వీటెనర్లు సాచరిన్, సుక్రలోజ్ వంటి వాటిపై హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. నియోటేమ్ ప్రభావం కేవలం గట్ మీదనే ఉంటుందనుకుంటే పొరపాటే. అది గుండెపై కూడా ప్రభావం చూపిస్తుందంటూ షాకింగ్ విషయం తెలిపారు. కొన్నిసార్లు అతిసారం, పేగులలో మంట, సెప్టిసిమియా వంటి ఇన్ఫెక్షన్లతో సహా అనేక రకాల ఆరోగ్యసమస్యలకు దారి తీస్తుంది.
ప్రాణాంతకమవుతుంది..
వాడుకలో ఉన్న కొన్ని సరికొత్త స్వీటెనర్లు చక్కెర కంటే వెయ్యి రెట్లు తియ్యగా ఉండే తీపి రుచిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది షుగర్ కంటే దారుణంగా మారిపోవచ్చు అంటున్నారు. ఈ స్వీటెనర్స్‌ని తక్కువగా తీసుకున్నా అది హెల్త్‌పై నెగిటివ్ ప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే.. తక్కువ మోతాదులో తీసుకున్నా.. అది గట్ ఆరోగ్యాన్ని చెడుగా ప్రభావం చేస్తుంది. అంతేకాకుండా మంచి బ్యాక్టీరియా మరణానికి దారితీస్తుంది. ఇది పరిస్థితిని దారుణం చేస్తుందని చెప్తున్నారు.
Also Read : ఈ సింపుల్ ఆసనంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.. కానీ వాళ్లు చేయకపోవడమే బెటర్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.