బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారా? అయితే ఇది మీ కోసమే చాలామంది బూడిద గుమ్మడికాయలను దిష్టి తగలకుండా ఇంటి ముందు వేలాడదీస్తారు. మరికొందరు వడియాలు పెట్టుకుంటారు. ఇవి మంచి టేస్ట్‌గా ఉంటాయి. అయితే రోజూ బూడిద గుమ్మడి కాయతో చేసిన జ్యూస్‌ను తాగితే మంచిది అంటున్నారు. బరువు తగ్గాలని చూసేవారికి ఇది మంచి డ్రింక్ అవుతుంది. దీనిలోని ఫైబర్ బరువు తగ్గేలా చేస్తుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సమ్మర్లో దీనిని తీసుకుంటే చాలా మంచిది. శరీరంలో వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మధుమేహమున్నవారు కూడా దీనిని తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దీనిలోని ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మంచి గట్ బ్యాక్టీరియాను ప్రమోట్ చేస్తుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదించి మంచి ఫలితాలు పొందవచ్చు. (Images Soure :Envato)