అన్వేషించండి

Kidney Health Tips : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన 8 గోల్డెన్ రూల్స్.. మూత్రపిండాలకు చాలా మంచిది

Daily Habits for Healthy Kidneys : మూత్రపిండాల సమస్యలు రాకుండా.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్​స్టైల్లో కొన్ని మార్పులు చేయాలంటున్నారు నిపుణులు. అవి పూర్తి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శరీరానికి తగినంత నీరు అందించడం కిడ్నీలకు ముఖ్యం.
  • ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మద్యం వాడకం తగ్గించాలి.
  • బీపీ, షుగర్ నియంత్రణ, పెయిన్ కిల్లర్స్ వాడకం జాగ్రత్తగా ఉండాలి.
  • వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం.

Golden Lifestyle Rules for Healthy Kidneys : మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని శుభ్రం చేసి.. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. నీటి సమతుల్యతను కాపాడడం వంటి కీలక పనులు చేస్తాయి. కానీ ఇది అసలే వేసవికాలం. పైగా తక్కువ నీళ్లు తాగడం, ఎక్కువ ఉప్పు తీసుకోవడం, జంక్ ఫుడ్ అలవాట్లు, డయాబెటిస్, బీపీ వంటి కారణాలతో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని గోల్డెన్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే..

తగినంత నీళ్లు 

రోజూ సరిపడా నీరు శరీరానికి అందించడం కిడ్నీల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణంగా రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మోతాదు మారవచ్చు.

ఉప్పు ఎక్కువగా తీసుకోకండి

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. ప్యాకెట్ ఫుడ్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తగ్గించడం మంచిది.

బీపీ, షుగర్ కంట్రోల్‌

డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్.. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు. రక్తంలో చక్కెర, బీపీ స్థాయిలు నియంత్రణలో లేకపోతే కిడ్నీ కణాలు దెబ్బతింటాయి. కాబట్టి రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి.

పెయిన్ కిల్లర్స్ వాడకం

పెయిన్ కిల్లర్స్‌ను తరచుగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవడం మంచిది కాదు. చాలా ప్రమాదకరం.

వ్యాయామం 

రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా లైట్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్ 

జంక్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ మీట్ వంటి వాటిలో హానికరమైన రసాయనాలు, అధిక సోడియం ఉంటాయి. ఇవి కిడ్నీల పనితీరును దెబ్బతీయవచ్చు. కాబట్టి వాటిని పూర్తిగా నిషేదించాలి. లేదా తగ్గించాలి.

ధూమపానం, మద్యం 

స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల రక్తప్రసరణ దెబ్బతిని కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీ డ్యామేజ్‌కు దారితీస్తుంది.

నిద్ర, ఒత్తిడి

తగినంత నిద్ర లేకపోవడం, అధిక మానసిక ఒత్తిడి కూడా కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం మంచిది. మెడిటేషన్, యోగా ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.

గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. కిడ్నీ సమస్యలు మొదట్లో ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉండొచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ద్వారా కిడ్నీలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న అలవాట్లే పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget