అన్వేషించండి

Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

Flood Cleanup Tips : వర్షాలు పడే సమయంలో చాలా ప్రదేశాల్లో వరదలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇంట్లో వరద నీరు చేరి తగ్గిన తర్వాత.. ఇంటిని ఎలా శుభ్రం చేస్తే మంచిదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వరద నీరు తగ్గాక, భద్రత చూసి ఇంట్లోకి ప్రవేశించండి.
  • గ్లవ్స్, మాస్క్ ధరించి నిల్వ నీరు, బురద తొలగించండి.
  • క్రిమిసంహారకంతో శుభ్రం చేసి, కలుషిత ఆహారాన్ని పారవేయండి.
  • ఇల్లు పూర్తిగా ఆరబెట్టి, అనారోగ్యం వస్తే వైద్యుడిని కలవండి.

Cleaning Home After Floods : భారీ వర్షాలు, వరదల కారణంగా చాలామందికి ఇళ్లలోకి నీరు చేరుతూ ఉంటుంది. అయితే వరద నీరు తగ్గిన వెంటనే ఇంట్లోకి వెళ్లి శుభ్రం చేయడం ప్రమాదకరం కావచ్చు. ఎందుకంటే వరద నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్, రసాయనాలు ఉండే అవకాశం ఉంది. అందుకే ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి వరద నీరు తగ్గాక ఇంటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం. 

ఇంట్లోకి వెళ్లే ముందు

వరద నీరు తగ్గిన తర్వాత ఇంట్లోకి వెళ్లే ముందు గోడలు, పైకప్పు, మెట్లు దెబ్బతిన్నాయేమో చెక్ చేసుకోండి. విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిందో లేదో నిర్ధారించుకోండి. గ్యాస్ లీకేజీ వాసన వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.

గ్లవ్స్, బూట్లు, మాస్క్ 

వరద నీటిలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చేతులకు రబ్బర్ గ్లవ్స్, కాళ్లకు వాటర్‌ప్రూఫ్ బూట్లు, ముక్కు-నోటికి మాస్క్ ధరించి మాత్రమే ఇంటిని శుభ్రపరిచే పనులు ప్రారంభించాలి. మీకు ఏమైనా గాయాలు ఉంటే వాటిని పూర్తిగా కవర్ చేసి పనులు చేసుకోవాలి. 

Also Read : కిచెన్ క్లీనింగ్ టిప్స్.. పండుగల సీజన్లో వంటగదిని మెరిసేలా చేసే 7 చిట్కాలివే

నిల్వ నీరు

ఇంట్లో నిల్వ ఉన్న నీటిని పంపు లేదా బకెట్ల సహాయంతో తొలగించండి. నీరు ఎక్కువసేపు నిల్వ ఉంటే దోమలు, దుర్వాసన, ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంటుంది.

బురద, చెత్త క్లీనింగ్ 

నేల, గోడలు, ఫర్నిచర్‌పై పేరుకున్న బురదను ముందుగా తొలగించాలి. తర్వాత సబ్బు నీటితో బాగా కడిగి శుభ్రం చేయాలి.

కెమికల్స్​తో శుభ్రత 

ఫ్లోర్లు, గోడలు, తలుపులు, బాత్రూమ్ వంటి ప్రాంతాలను క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రం చేయాలి. తయారీదారు సూచించిన విధంగా కెమికల్స్ ఉపయోగించడం మంచిది. శుభ్రపరిచే సమయంలో గదుల్లో గాలి బాగా వచ్చేలా కిటికీలు తెరిచి ఉంచండి.

తడిసిన వస్తువులు

పరుపులు, దిండ్లు, కార్పెట్లు, చెక్క ఫర్నిచర్ ఎక్కువసేపు తడిగా ఉంటే ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఎండని వస్తువులను మళ్లీ ఉపయోగించవద్దు. అవసరమైతే మార్చడం మంచిది.

ఆహార పదార్థాలు

వరద నీటిలో ఉండిపోయిన ఆహార పదార్థాలు, లేదా తెరిచి ఉన్న ప్యాకెట్లు, మందులు ఉపయోగించకండి. అనుమానం ఉన్న ఆహారాన్ని పారేయడమే మంచిది.

Also Read : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్

తాగునీరు

వరదల సమయంలో తాగునీరు కలుషితమై ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరిగించిన లేదా సురక్షితమైన తాగునీటినే ఉపయోగించండి. నీటి ట్యాంకులు కూడా శుభ్రం చేసిన తర్వాతే వినియోగించాలి.

పూర్తిగా ఆరబెట్టండి

కిటికీలు, తలుపులు తెరిచి గాలి ప్రసరణ ఉండేలా చూడండి. ఇంటిని పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్లు లేదా డీహ్యూమిడిఫైయర్ ఉంటే దానిని కూడా ఆన్ చేయాలి. తేమ ఎక్కువకాలం ఉంటే ఫంగస్ పెరిగే అవకాశం ఉంది.

అనారోగ్య లక్షణాలు ఉంటే..

వరదల తర్వాత చాలామంది జ్వరం, విరేచనాలు, వాంతులు, చర్మ దద్దుర్లు, శ్వాస సమస్యలు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. వరదల తర్వాత నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Also Read : ఇంట్లో కారు వాష్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి.. పర్​ఫెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఇదే

వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం కేవలం పరిశుభ్రత కోసమే కాదు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చేయాల్సిన ముఖ్యమైన విషయం. భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ, క్రిమిసంహారక పద్ధతిలో ఇంటిని శుభ్రం చేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్లు, ఫంగస్, దుర్వాసన వంటి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఉంటే పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget