అన్వేషించండి

Car Wash at Home : ఇంట్లో కారు వాష్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి.. పర్​ఫెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఇదే

Home Car Wash Tips : డబ్బు ఆదా కోసం ఇంట్లో కారు కడగాలనుకుంటే కొన్ని తప్పులు చేయకండి. కానీ ఈ టిప్స్ ఫాలో అయితే మంచిగా క్లీన్ అవుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంట్లో కారును డిష్‌వాష్, బట్టల డిటర్జెంట్‌తో కడగకండి.
  • నిమ్మకాయ, బేకింగ్ సోడా, వెనిగర్ వంటివి పెయింట్‌ను పాడుచేస్తాయి.
  • ఎండలో కాకుండా నీడలో కడగాలి, నీటి మరకలు పడకుండా చూసుకోవాలి.
  • పాత బట్టలకు బదులు మైక్రోఫైబర్ వస్త్రం వాడాలి, దిగువ నుండి శుభ్రం చేయాలి.

Car Washing Mistakes : ఇటీవల చాలామంది తమ కార్లను ఇంట్లో కడగడానికి ఇష్టపడుతున్నారు. వీకెండ్స్, సెలవుల సమయంలో పిల్లలతో లేదా పార్టనర్​తో కలిసి దీనిని వాష్ చేస్తూ.. టైమ్ గడిపేస్తున్నారు. అలాగే ఇలా ఇంట్లో కారు వాష్ చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. సమయం కూడా మిగులుతుంది. కానీ సరైన పద్ధతిలో కారును శుభ్రం చేయకపోతే.. అది కారుకు నష్టం కలిగించవచ్చు. చిన్న చిన్న తప్పుల వల్ల కారు పెయింట్, గ్లాస్, బాడీపై ప్రభావం చూపుతాయి. అందుకే కారు వాష్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా ఇంట్లోనే కారును కడుగుతుంటే.. ఏ తప్పులు చేయకూడదో.. కారు వాష్ చేయడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.

ఈ ఇంటి చిట్కాలతో జాగ్రత్త

చాలామంది కారును కడగడానికి డిష్‌వాష్ లిక్విడ్, బట్టలు ఉతికే డిటర్జెంట్ లేదా షాంపూని ఉపయోగిస్తారు. ఇది అతి పెద్ద తప్పు. ఈ ఉత్పత్తులు కార్ల పెయింట్ కోసం తయారు చేసినవి కావు. దీనివల్ల ఏమవుతుందంటే.. నెమ్మదిగా దానిపై పొర డ్యామేజ్ అవుతుంది. అదనంగా నిమ్మకాయ, బేకింగ్ సోడా, వెనిగర్ వంటి గృహ చిట్కాలు కూడా కారుకు హానికరం. వాటిలోని రసాయనాలు పెయింట్ మీద చిన్న గీతలు ఏర్పరుస్తాయి. మెటల్ భాగాలపై తుప్పు పట్టే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి కారును శుభ్రపరుస్తాయి. కానీ కాలక్రమేణా కారు మెరుపు, విలువ రెండింటినీ తగ్గిస్తాయి. అందుకే ఎప్పుడు కారు వాష్ చేసినా.. కార్ల కోసం తయారు చేసిన ప్రత్యేక షాంపూనే ఉపయోగించాలి.

ఎండలో కడిగితే..

చాలామంది కార్లను శుభ్రం చేయడానికి పాత బట్టలు, టవల్ లేదా టీ-షర్టులను ఉపయోగిస్తారు. ఇది కూడా ఒక పెద్ద తప్పు. ఈ బట్టలలో దుమ్ము ఉంటుంది. ఇది కారు బాడీపై గీతలు ఏర్పరుస్తుంది. ముఖ్యంగా ముదురు రంగు కార్లలో ఇది త్వరగా కనిపిస్తుంది. అదనంగా ఎండలో కారును కడగడం కూడా మంచిది కాదు. వేడిలో నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీని వలన కారుపై నీటి మరకలు ఏర్పడతాయి. ఇది కారు మెరుపును తగ్గిస్తుంది. పెయింట్ త్వరగా పాడవుతుంది. మీ కారు ఎల్లప్పుడూ శుభ్రంగా, మెరుస్తూ ఉండాలని మీరు కోరుకుంటే.. దానిని ఎల్లప్పుడూ నీడలో లేదా చల్లని ప్రదేశంలో కడగాలి.

సరైన పద్ధతి ఇదే..

కారును కడగడానికి సరైన మార్గాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ కారు దిగువ భాగం, టైర్ల నుంచి క్లీన్ చేయడం ప్రారంభించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మురికి ఉంటుంది. తరువాత పై బాడీ, రూఫ్‌ను శుభ్రం చేయండి. మైక్రోఫైబర్ వస్త్రం లేదా స్పాంజ్‌ని ఉపయోగించండి. ఎందుకంటే ఇది పెయింట్‌కు నష్టం కలిగించదు. అలాగే ఎప్పుడూ కార్ వాష్ షాంపూని ఉపయోగించండి. ఆధునిక కార్లలో మల్టీ లేయర్ పెయింట్ ఉంటుందని నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. దీనికి సరైన సంరక్షణ అవసరం. తప్పు పద్ధతిలో శుభ్రం చేస్తే ఈ పొర నెమ్మదిగా పాడవుతుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!
ఇకపై తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌.. Mahindra XUV 3XO CNG వెర్షన్‌ రాబోతోంది

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget