UPSC Geo‐Scientist Results: కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి! మెయిన్స్ ఎప్పుడంటే?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 21న నిర్వహించిన 'కంబైన్డ్ జియో సైంటిస్ట్' (ప్రాథమిక) పరీక్ష-2021 ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 21న నిర్వహించిన 'కంబైన్డ్ జియో సైంటిస్ట్' (ప్రాథమిక) పరీక్ష-2021 ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరుకానున్నారు.
జియోసైంటిస్ట్ ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ప్రాథమిక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు, ఈ ఏడాది జూన్ 24, 25 తేదీల్లో నిర్వహించే ప్రధాన పరీక్షకు హాజరుకావాలి. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన కంబైన్డ్ జియో సైంటిస్ట్-2021 పరీక్ష నియమనిబంధనలను వారు తెలుసుకుని ఉండాలి. 21.09.202న కమిషన్ జారీ చేసిన పరీక్ష ప్రకటన నం.2/2023-జీఈవోఎల్‌ను కూడా క్షుణ్నంగా చదివి ఉండాలి. ఈ ప్రకటన కమిషన్ వెబ్‌సైట్‌లోనూ ఉంది.
మెయిన్ పరీక్షకు మూడు వారాల ముందు నుంచి అభ్యర్థులు హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. పరీక్ష ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక, అంటే తుది ఫలితాలను కూడా ప్రకటించి తర్వాత, అభ్యర్థులు సాధించిన మార్కులను వారికి తెలియజేయడంతోపాటు పరీక్ష కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. పరీక్ష కేంద్రం లేదా ప్రాంతం మార్పు కోసం వచ్చే అభ్యర్థనలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు.
యూపీఎస్‌సీ తన భవన ప్రాంగణంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పరీక్షకు సంబంధించిన సమాచారం లేదా స్పష్టత కావాలనుకున్నవారు, అన్ని పని దినాల్లో ఉదయం 10 గం. సాయంత్రం 5 గం. మధ్య నేరుగాగానీ, టెలిఫోన్ నంబర్లు (011)- 23388088, 23385271/23381125/23098543 ద్వారాగానీ సంప్రదించవచ్చు.
ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల!
యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2023 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 3న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూడవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో భాగంగా జూన్ 25న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. యూపీఎస్సీ ఫిబ్రవరి 19న ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను గతేడాది సెప్టెంబరు 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని 327 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలను వెల్లడించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..