UPSC CGSE 2024: యూపీఎస్సీ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్-2024' అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష వివరాలు ఇలా
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ (CGSE) -2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్‌కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 9న విడుదల చేసింది.
Combined Geo-Scientist (Preliminary) Examination, 2024: కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ (CGSE) -2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్‌కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిబ్రవరి 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ-అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18న పరీక్ష నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్‌పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్(అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురంలో పరీక్ష నిర్వహించనున్నారు.
కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది సెప్టెంబరు 20న 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024' నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి అక్టోబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
వివరాలు..
* కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ - 2024
ఖాళీల సంఖ్య: 56
కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI)-గనుల మంత్రిత్వ శాఖ: 48 పోస్టులు
➥ జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 34 పోస్టులు
➥ జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 01 పోస్టులు
➥ కెమిస్ట్, గ్రూప్-ఎ: 13 పోస్టులు
కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్- జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ: 08 పోస్టులు
➥ సైంటిస్ట్ బి (హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 04 పోస్టులు
➥ సైంటిస్ట్ బి (కెమికల్), గ్రూప్-ఎ: 02 పోస్టులు
➥ సైంటిస్ట్ బి (జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు
అర్హత: మాస్టర్ డిగ్రీ(జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)- అప్లైడ్ జియోఫిజిక్స్.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, ఢిల్లీ, డిస్‌పూర్, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.
మెయిన్ పరీక్ష కేంద్రాలు: భోపాల్, చెన్నై, ఢిల్లీ, డిస్‌పూర్(గువాహటి), హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబయి, సిమ్లా.
ALSO READ:
యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్‌కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE)-2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిబ్రవరి 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈ-అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18న ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష అడ్మిట్‌కార్డులు, వివరాల కోసం క్లిక్ చేయండి..