అన్వేషించండి

UPSC ESE 2024: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అడ్మిట్‌కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ - 2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్‌ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది.

UPSC ESE Preliminary Exam Admit Card: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ (ESE)-2024 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్‌ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిబ్రవరి 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈ-అడ్మిట్‌‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18న ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ సెప్టెంబరు 6న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 167 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. స్టేజ్‌-1(ప్రిలిమినరీ) ఎగ్జామ్‌, స్టేజ్‌-2(మెయిన్‌) ఎగ్జామ్‌, స్టేజ్‌-3(పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష ఇలా...

➦ ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 500 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 200 మార్కులకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షకు 2 గంటలు, పేపర్-1 పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

➦ మెయిన్ పరీక్ష: మొత్తం 600 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 300 మార్కులకు పేపర్-1 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు.  ఒక్కో పేపర్‌కు 3 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. కన్వెన్షల్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం.

పోస్టుల వివరాలు..

* ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024

పోస్టుల సంఖ్య: 167 (సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్).

సంస్థలు: ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్, నావెల్ అర్మామెంట్ సర్వీసెస్, జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).

విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ డిగ్రీ/ రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్‌లో పోస్టులకు ఫిజిక్స్ లేదా రేడియో ఫిజిక్స్/ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

Notification

ALSO READ:

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget