అన్వేషించండి

UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మూడో విడత ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే

UPSC: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2023 పరీక్షకు సంబంధించి మూడవ విడత ఇంటర్వ్యూ షెడ్యూలును యూపీఎస్సీ ఫిబ్రవరి 16న వెల్లడించింది.

UPSC Civil Services Personality Tests (Interviews): యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2023 పరీక్షకు సంబంధించి మూడవ విడత ఇంటర్వ్యూ షెడ్యూలును యూపీఎస్సీ ఫిబ్రవరి 16న వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహించనున్నారు. మూడోవిడతలో మొత్తం 817 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అభ్యర్థుల రూల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే ఇ-సమన్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు సివిల్స్‌ ప్రధాన పరీక్షల నిర్వహణ; డిసెంబర్‌ 8న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌)కు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

యూపీఎస్సీ 2023 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మొదటి విడత షెడ్యూలును డిసెంబరు 19న వెల్లడించిన సంగతి తెలిసిందే. మొదటి విడత ఇంటర్వ్యూకు మొత్తం 1026 మంది ఎంపికయ్యారు. వీరికి జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక రెండో విడత ఇంటర్వ్యూ షెడ్యూలును జనవరి 25న విడుదల చేయగా..1003 మంది ఎంపికయ్యారు. వీరికి ఫిబ్రవరి 19 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభంకానున్నాయి. మార్చి 15 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇక తాజాగా మూడోవిడత ఇంటర్వ్యూ జాబితాను యూపీఎస్సీ వెల్లడించింది.

రెండో విడత ఇంటర్వ్యూ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మూడో విడత ఇంటర్వ్యూ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15 నుంచి 24 వ‌ర‌కు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్ష ఫలితాలు డిసెంబరు 8న యూపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 2,844 మంది ఇంటర్వ్యూలకు  అర్హత సాధించారు. మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూ (ప‌ర్సనాలిటీ టెస్ట్‌)కు షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. 

గత మే నెలలో జరిగిన ప్రాథమిక పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరుకాగా.. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. వచ్చే జనవరిలో మొదలయ్యే ఇంటర్వ్యూలకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది వరకు ఎంపికయ్యారని అంచనా. గతేడాది ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 40 మంది వరకు సివిల్ సర్వీస్ కొలువులకు ఎంపికయ్యారు.

మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశలో ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌)కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డీటైల్డ్‌ అప్లికేషన్‌ ఫాం-2 అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తిచేసిన అభ్యర్థులకే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంట‌ర్వ్యూ ప్రతిభ‌, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కుల‌ను బ‌ట్టి ఆలిండియా స‌ర్వీసుల‌కి అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. 

అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసంగానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫ్యాక్స్: 011-23387310, 011-23384472 లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌ను లేదా csm-upsc@nic.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 16, 17, 18, 24, 25 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు సివిల్‌ సర్వీసెస్‌–2022 ప్రిలిమ్స్ ప‌రీక్ష జూన్ 5న ఉద‌యం పేప‌ర్‌-1 (జ‌న‌ర‌ల్ స్డడీస్) ప‌రీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. ఈ పేపర్‌–1 ప్రశ్నప‌త్రంలో 100 ప్రశ్నలు 200 మార్కుల‌కు నిర్వహించారు. అలాగే మ‌ధ్యాహ్నం పేపర్‌–2(అప్టిట్యూడ్‌ టెస్ట్‌–సీశాట్‌)ను 80 ప్రశ్నలతో 200 మార్కుల‌కు నిర్వహించారు. జులై 12న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 11,845 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 

యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీలను ప్రకటించింది. గత ఏడాది కంటే 300 ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Veera Raghava Reddy గురించి గ్రామ సర్పంచ్ సంచలన వ్యాఖ్యలు | Chilkur balaji temple | ABP DesamDeputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP DesamPM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP DesamTrump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Balakrishna: ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
High Speed rail: హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
Love Stroy: శారీరక సంబంధం లేదని ప్రేమ వివాహేతర సంబంధం కాదు -  మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
శారీరక సంబంధం లేదని ప్రేమ వివాహేతర సంబంధం కాదు - మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
Lifetime Pani Puri: ఇదేందయ్యా.. ఇలాంటి ఆఫర్లు కూడా ఉంటాయా ? 99 వేలకు లైఫ్ టైం పానీ పూరీ అంట !
ఇదేందయ్యా.. ఇలాంటి ఆఫర్లు కూడా ఉంటాయా ? 99 వేలకు లైఫ్ టైం పానీ పూరీ అంట !
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.