అన్వేషించండి

UPSC NDA&NA: యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ (2) - 2023 తుది ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి

UPSC: ఎన్‌డీఏ & ఎన్ఏ (2)-2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఏప్రిల్ 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందబాటులో ఉంచింది.

NDA & NA 2023 Results: ఎన్‌డీఏ & ఎన్ఏ (2)-2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఏప్రిల్ 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందబాటులో ఉంచింది. తుది ఫలితాల ద్వారా మొత్తం 699 మంది అభ్యర్థులు వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. మొత్తం 395 ఉద్యోగాల భర్తీకి  సెప్టెంబరు 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తాజాగా తుది జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. జాబితా రూపకల్పనలో అభ్యర్థుల మెడికల్ పరీక్షల ఫలితాలను పరిగణనలోకి తీసుకోలేదు. 

UPSC NDA-2 2023 తుది ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?

🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in ఓపెన్‌ చెయ్యాలి.

🔰 హోమ్‌పేజ్‌లో కనిపించే 'Final Result: National Defence Academy and Naval Academy Examination (II), 2023' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. 

🔰 క్లిక్ చేయగానే ' ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ కనిపిస్తుంది.

🔰  ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

🔰  మీ పేరును చెక్‌ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.

NDA, NA-(2) 2023 తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(NDA) 152వ కోర్సు, నేవల్‌ అకాడమీ(NA) 114వ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మే 17 నుండి జూన్ 6 వరకు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 395 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 3న రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షను రెండు సెషన్లలో  నిర్వహించింది. ఉదయం 10 గంటల నుండి మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో సెషన్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది జులై 2 నుంచి కోర్సులు ప్రారంభంకానున్నాయి.

సందేహాలుంటే సంప్రదించవచ్చు..

🔰 అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన, విద్యార్హతలు తదితర విషయాల్లో ఏమైనా సందేహాలుంటే  011-23385271/011- 23381125/011-23098543 ఫోన్  నెంబర్లలో ఉదయం 10:00 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించవచ్చు. 

🔰 ఇంటర్వ్యూకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 011-26175473, 011-23010097 నెంబర్లు లేదా joinindianarmy.nic.in for Army, Emai: officer-navy@nic.in ద్వారా సంప్రదించవచ్చు.

🔰 అదేవిధంగా నేవీ/నేవల్ అకాడమీకి సంబంధించిన సమస్యలపై  011-010231 Extn.7645/7646/7610 ఫోన్ నెంబర్లు లేదా joinindiannavy.gov.in  లేదా www.careerindianairforce.cdac.in ద్వారా సంప్రదించవచ్చు.

ALSO READ:

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
కోల్ ఇండియా ఆధ్వర్యంలోని నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 34 సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌, మెడికల్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులకు నెలకు రూ.70,000-2,00,000, మెడికల్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ. 60,000 - 1,80,000 జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Embed widget